MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • మనం తినే బియ్యంకు పదివేల ఏళ్ల చరిత్ర... మొదట వరి ఎక్కడ పండిందో తెలుసా?

మనం తినే బియ్యంకు పదివేల ఏళ్ల చరిత్ర... మొదట వరి ఎక్కడ పండిందో తెలుసా?

వరి పుట్టుక, పరిణామం, మానవ సమాజంపై దాని ప్రభావం గురించి ఓ శాస్త్రవేత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. ఆసియా వరి పుట్టుక, కొత్త రకాలు ఎలా పుట్టుకొచ్చాయి, వరి సమాజంలో తెచ్చిన మార్పుల గురించి సదరు శాస్త్రవేత్త ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 08 2025, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వరి పంటది ఆసక్తికర చరిత్ర..
Image Credit : our own

వరి పంటది ఆసక్తికర చరిత్ర..

వరి పుట్టుక, మానవ సమాజంపై దాని ప్రభావం గురించి లండన్ యూనివర్సిటీ కాలేజీ పురావస్తు శాస్త్రవేత్త డోరియన్ క్యూ ఫుల్లర్ అధ్యయనం చేశారు. ఆయన పరిశోదనలో వరి పంట, దానినుండి వచ్చే బియ్యంకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఫుల్లర్ పురావస్తు, వృక్ష శాస్త్రవేత్త. తవ్వకాల్లో దొరికిన మొక్కల అవశేషాలను, పంటలు, కలుపు మొక్కలు, అడవి ఆహారం, వంట చెక్కలను అధ్యయనం చేస్తారు. దీని ద్వారా గత సంస్కృతుల్లో ఏ పంటలు ఉన్నాయి… వ్యవసాయం, మొక్కలు, మానవ ఆహారం ఎలా మారాయి అని పరిశీలిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వరి ఎక్కడి నుంచి వచ్చింది?
Image Credit : our own

వరి ఎక్కడి నుంచి వచ్చింది?

పుల్లర్ ప్రకారం ప్రపంచంలో రెండు రకాల వరి వంగడాలు ఉన్నాయి. ఆఫ్రికా వరి పశ్చిమ ఆఫ్రికాలో విడిగా పెరిగింది. ఆసియా వరి ఇండియా, చైనా, జపాన్‌లలో పండిస్తారు. ఆసియా వరిలో 'ఇండికా', 'జపోనికా' రకాలున్నాయి. 'ఇండికా' దక్షిణాసియాలో, 'జపోనికా' తూర్పు ఆసియాలో ఎక్కువ.

వరి మొదట చైనాలో పండించారు. అది జపోనికా రకం. యాంగ్జీ నది, హునాన్, జెజియాంగ్ ప్రాంతాల్లో 10,000 ఏళ్ల క్రితం వరి పండించిన ఆధారాలున్నాయి. ఉత్తర భారతంలో గంగా నది ప్రాంతంలో అడవి వరి వాడకంలో ఉండేది. 5,000 నుండి 9,000 ఏళ్ల క్రితం పండించే అవకాశం ఉందంటున్నారు.

Related Articles

Related image1
బియ్యం ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదా?
Related image2
Fengal Cyclone దూసుకొస్తోంది : తెలుగు రాష్ట్రాల వరి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే పంట సేప్
37
కొత్త రకాలు ఎలా వచ్చాయి?
Image Credit : our own

కొత్త రకాలు ఎలా వచ్చాయి?

తూర్పు ఆసియా జపోనికా, భారత అడవి వరి మధ్య వేల ఏళ్ల క్రితం సంకరం జరిగిందని DNA పరిశోధనలు చెబుతున్నాయి. తూర్పు ఆసియా నుంచి వ్యాపారం ద్వారా భారత్‌కు వచ్చిన వరి, స్థానిక రకాలతో కలిసి ఇండికా వరిని ఏర్పరిచింది. ఈ సంకరం 4,000 ఏళ్ల క్రితం వ్యాపారం ద్వారా వరి భారత్‌కు వచ్చినప్పుడు జరిగి ఉండొచ్చు అని ఫుల్లర్ అంటున్నారు.

47
వరి సాగు ప్రపంచాన్ని మార్చింది
Image Credit : our own

వరి సాగు ప్రపంచాన్ని మార్చింది

వరి సాగు ప్రపంచాన్ని మార్చింది. గోధుమ, రాగుల లాగా కాకుండా వరికి ఎక్కువ నీరు కావాలి... అందుకే మొదట యాంగ్జీ, గంగా నదుల లాంటి నీటి ప్రాంతాల్లో వరి పండించారు. తర్వాత నీటిపారుదల ఉన్న ప్రాంతాలకూ వరి సాగు విస్తరించింది. కాలువలు తవ్వి, వర్షపు నీటిని నిల్వ చేసే పొలాలు ఏర్పడ్డాయి. ఇది పెద్ద మార్పు.

సమాజంపై ప్రభావం:

పొలాలు, నీటిపారుదలకు ఎక్కువ శ్రమ అవసరం. నీటిపారుదలతో వరి దిగుబడి పెరిగి చాలా మందికి ఆహారం దొరికింది. భారత్, ఆగ్నేయాసియాలో వరి సాగు విస్తరించింది. జనాభా పెరుగుదల, నగరాలు, సామాజిక వ్యవస్థలకు దారితీసింది. భూమి, వరి, నీటిపారుదలపై ఆధిపత్యం సామాజిక వ్యవస్థలకు కారణమైంది.

జంతువులపై ప్రభావం:

వరి పొలాలకు దున్నపోతులు బాగా సరిపోయాయి. దున్నలు భారతదేశ జంతువులు. హరప్పా కాలంలోనే వాటిని పెంచుకునేవారు. వరి సాగు పెరగ్గా, దున్నల వాడకం పెరిగింది. వరి పొలాలు చేపలను ఆకర్షించాయి. ఆగ్నేయాసియాలో కొన్ని చేపలు ఆహారంగా మారాయి. వరి పొలాల్లో చేపల పెంపకం పెరిగింది.

57
సంస్కృతుల మధ్య సంబంధాలు
Image Credit : our own

సంస్కృతుల మధ్య సంబంధాలు

వరి సాగు, నగరాలు గంగా మైదానంలో ఇనుప యుగంలో అంటే 3,000 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. మట్టికుండలు, రాళ్లు, పూసలు, లోహపు వస్తువులు తయారయ్యాయి. వీటిని దూర ప్రాంతాలకు ఎగుమతి చేశారు.

భారత్, ఆగ్నేయాసియా మధ్య సంబంధాలు అప్పుడే మొదలయ్యాయి. ఆగ్నేయాసియాలో భారతీయ మట్టికుండలు, పూసలు, పెసలు, కందిపప్పు లాంటివి దొరికాయి. తర్వాత బౌద్ధ, హిందూ మతాలు ఆగ్నేయాసియాకు వ్యాపించాయి. కానీ మొదటి సంబంధం వరి సాగు, చేతిపనుల ద్వారా ఏర్పడింది అని ఈ అధ్యయనం చెబుతోంది.

67
పురావస్తు వరి అవశేషాలు
Image Credit : our own

పురావస్తు వరి అవశేషాలు

చైనాలోని టియాన్లుషాన్ ప్రదేశంలో 2004లో ఫుల్లర్ పరిశోధన చేశారు. అక్కడే వరి గింజను మొక్కకు కలిపే చిన్న భాగాన్ని మొదట కనుగొన్నారు. ఇది సాగు వల్ల మారిన ముఖ్యమైన ఆకారం. ముందు వరి దానంతట అదే వ్యాపించేది. ఇప్పుడు మనుషులే నాటి, కోయాలి. అక్కడ దొరికిన వరి గింజలను చూస్తే అడవి వరి నుంచి సాగు వరి ఎలా మారిందో అర్థమవుతుంది.

2006లో ఉత్తరప్రదేశ్‌లోని లహురదేవా ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి ప్రజలు 6,000 ఏళ్ల క్రితమే బియ్యాన్ని ఆహారంగా తినేవారని తెలిసింది. కానీ అది సాగు వరియా, అడవి వరియా అనే చర్చ కొనసాగుతోంది.

77
వాతావరణ మార్పులకు వరి కారణమా?
Image Credit : our own

వాతావరణ మార్పులకు వరి కారణమా?

వరి పొలాల నుంచి మీథేన్ వాయువు వస్తుంది కాబట్టి వరి వాతావరణ మార్పుకు కారణం అనే వాదన ఉంది. అయితే మీథేన్ వరి నుంచి రాదు తడి నేలల్లోని సూక్ష్మజీవుల నుంచి వస్తుంది. వాతావరణ మార్పుకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాల వాడకమే. మీథేన్ తగ్గించే వరి సాగు పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.

వాతావరణ మార్పు వర్షపాతాన్ని మారుస్తోంది. ఇది వరి సాగుకు సవాలు… ఎందుకంటే నీటి కొరత, వర్షాభావం పెరగొచ్చు. కాబట్టి రాగుల లాంటి వర్షాభావాన్ని తట్టుకునే పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇప్పటి వరి, పాత వరి:

ఇప్పటి వరి, పాత వరిలో కొన్ని మార్పులున్నాయి. అడవి వరి ఎర్రగా ఉండేది. ఇప్పుడు తెల్ల, బ్రౌన్ బియ్యంతో పోలిస్తే ఎర్ర వరి తక్కువ. తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, వేరే రుచి ఉంటుంది అని కొన్ని రకాలను ఎంచుకున్నారు. బాస్మతి, మల్లె వంటి రకాలు ఎంచుకున్నారు. మనుషులు అడవి వరిని, వేర్వేరు సంస్కృతులకు తగ్గట్టుగా మార్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రపంచం
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
బియ్యం ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదా?
Recommended image2
Fengal Cyclone దూసుకొస్తోంది : తెలుగు రాష్ట్రాల వరి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే పంట సేప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved