- Home
- International
- మీ ఇంటినుండే పిల్లల్ని ఎలాన్ మస్క్ స్కూల్ ఆస్ట్రా నోవాలో చదివించొచ్చు.. ఇందుకోసం మీరేం చేయాలో తెలుసా?
మీ ఇంటినుండే పిల్లల్ని ఎలాన్ మస్క్ స్కూల్ ఆస్ట్రా నోవాలో చదివించొచ్చు.. ఇందుకోసం మీరేం చేయాలో తెలుసా?
ఎలాన్ మస్క్ స్కూల్ అస్ట్రా నోవాలో పిల్లలకి బట్టీ పట్టించడం ఉండదు... ఆలోచించడం ఎలాగో నేర్పుతారు. బ్యాగులు, హోంవర్క్, రిపోర్ట్ కార్డులు లేని ఈ స్కూల్ చాలా ప్రత్యేకం. మరీ ఈ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

ఎలాన్ మస్క్ పిల్లల కోసం ప్రత్యేక స్కూల్
Elon Musk Astra Nova School : ఎలాన్ మస్క్ అనగానే మనందరికి గుర్తువచ్చేది టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్ వంటి వినూత్న వ్యాపారాలు. ఇలా సరికొత్త ఆలోచనలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు… సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఇప్పటికే నిరూపించుకున్నారు మస్క్. అయితే కేవలం వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ వినూత్న జీవనం సాగిస్తుంటారాయన. అందుకు నిదర్శనమే ఆయన సంతానం, వారి పెంపకం.
ఎలాన్ మస్క్ కు ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు సంతానం. వారిని రెగ్యులర్ గా అందరు తల్లిదండ్రుల మాదిరిగా స్కూల్ కి పంపితే అతడు మస్క్ ఎందుకు అవుతాడు... స్కూల్ నే ఇంటికి రప్పించుకున్నాడు. తన పిల్లలతో పాటు స్పేస్ ఎక్స్ లో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం ఆన్ లైన్ స్కూల్ ను ప్రారంభించారు... అందే ఆస్ట్రానోవా.
ఎలాన్ మస్క్ స్కూళ్లో మీ పిల్లల్ని కూడా చదివించొచ్చు
ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆన్ లైన్ స్కూల్లో ఇతర విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల చదువు కేవలం మార్కుల కోసం కాకుండా వాళ్ళు అర్థం చేసుకుని నేర్చుకోవాలని అనుకుంటే ఈ స్కూల్ సరిగ్గా సరిపోతుంది.
ఇది సాధారణ స్కూల్ కాదు, పిల్లలకి ఆలోచించడం నేర్పే ఆన్‌లైన్ స్కూల్. మరి ఎలాన్ మస్క్ అస్ట్రా నోవా స్కూల్‌లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? ఫీజు ఎంత? బోధనా విధానం ఏంటి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అస్ట్రా నోవా స్కూల్ అంటే ఏంటి?
అస్ట్రా నోవా అనేది 10 నుండి 15 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ స్కూల్. ఇక్కడ సాధారణ స్కూళ్ల మాదిరిగా విద్యార్థుల భుజాలకు బరువైన బ్యాగులు, బట్టీ పట్టించే చదువులు, రిపోర్ట్ కార్డులు, హోంవర్కులు ఉండవు. పిల్లల నిజ జీవితానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే ఇక్కడ నేర్పుతారు.
ఈ స్కూల్‌లో మ్యాథ్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా నేర్పుతారు... ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రీ-కాలిక్యులస్ ద్వారా ఇక్కడ 'ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్' అనే ప్రత్యేక క్లాస్ ఉంటుంది. దీని ద్వారా పిల్లలు ఏదైనా సమస్యను ఆలోచించి పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు.
అస్ట్రా నోవా బోధనా విధానం సాంప్రదాయ స్కూళ్లకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి కొన్ని నెలలకు కొత్త సిలబస్ ఉంటుంది... దీనివల్ల పిల్లల మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. తద్వారా వాళ్ళలో చదువుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది.
అస్ట్రా నోవా స్కూల్ ఫీజు ఎంత?
ఈ స్కూల్ ఫీజు విని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ ఒక గంట క్లాస్ ఫీజు దాదాపు రూ.1.88 లక్షలు (2200 డాలర్లు). విద్యార్థులు కనీసం 2 గంటల నుండి గరిష్టంగా 16 గంటలు క్లాసులు తీసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు 16 గంటల క్లాసులు తీసుకుంటే మొత్తం కోర్సు ఫీజు దాదాపు రూ.30.20 లక్షలు (35,200 డాలర్లు).
మీ పిల్లలు ఈ ప్రత్యేక విద్యా విధానంలో భాగం కావాలనుకుంటే స్కూల్ వెబ్‌సైట్ www.astranova.org సందర్శించవచ్చు. ఇక్కడ అడ్మిషన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఎలాన్ మస్క్ అస్ట్రా నోవా స్కూల్ ఎందుకంత ప్రత్యేకం?
21వ శతాబ్దపు పిల్లలకి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే విద్య అందించాలని ఎలాన్ మస్క్ నమ్ముతారు. అస్ట్రా నోవా ఈ ఆలోచనతోనే రూపొందింది. ఇక్కడ కేవలం పుస్తకాల జ్ఞానం కాదు, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత నేర్పుతారు. ఈ స్కూల్ పిల్లలకి ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం నేర్పుతుంది. అందుకే ఈ స్కూల్ ప్రపంచ విద్యారంగంలో కొత్త మార్గదర్శిగా నిలుస్తోంది.