నితిన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?
టాలీవుడ్ లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే వారిలో కొంత మంది చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నితిన్ నటించిన దిల్ సినిమాలో నటించిన 5 స్టార్ నటులు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఇంతకీ వారు ?

జయం సినిమాతో ఇండస్ట్రీకి పనిచయం అయ్యాడు హీరో నితిన్. కాని దిల్ సినిమాతో యంగ్ హీరోకి మాస్ ఇమేజ్ వచ్చింది. కమర్షియల్ హీరోగా నితిన్ దిల్ సినిమాతో సక్సెస్ అయ్యాడు. నిర్మాతగా దిల్ రాజు స్టార్ డమ్ సాధించింది కూడా దిల్ సినిమాతోనే. అందుకే రాజుకు దిల్ అనే క్యాప్షన్ వచ్చింది. ఈక్రమంలో దిల్ సినిమాకు సబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది. దిల్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. అందులో కొంత మంది చిన్న వయస్సులోనే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ఇంతకీ వారు ఎలా మరణించారో తెలుసా?
దిల్ సినిమాలో నితిన్ పాత్రకు తండ్రిగా నటించిన సీనియర్ నటుడు చలపతిరావు. ఈమధ్య కాలంలోకే చలపతిరావు మరణించారు. చనిపోయేవరకూ నటిస్తూనే ఉన్నారు చలపతిరావు. 78 ఏళ్ల వయస్సులో ఆయన సడెన్ గా గుండెపోటుతో మరణించారు. 24 డిసెంబర్ 2022 లో ఇంట్లో భోజనం చేస్తూ..కన్నుమూశారు చలపతిరావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి చలపతిరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. విలన్ గా తండ్రిగా, తాతగా ఎన్నో పాత్రలు చేశారు చలపతిరావు.
ఇక దిల్ సినిమా సక్సెస్ లో హీరో హీరోయిన్ తో పాటు వేణుమాధవ్ ది కూడా కీ రోల్ అని చెప్పాలి. నితిన్ , చలపతిరావుతో వేణుమాధవ్ కాంబినేషన్ సీన్లు చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియన్స్. దిల్ సినిమాలో వేణుమాధవ్ మర్చిపోలేని పాత్ర చేశాడు. వేణుమాధవ్ ఈ సినిమాలో హీరో నితిన్ కు మేన మామగా, నితిన్ తో పాటే చదువకునే వ్యక్తిగా నటించారు. వేణుమాధవ్ అతి చిన్న వయస్సులో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2019 సెప్టెంబర్ లో 49 ఏళ్ల వయస్సులో వేణు మాధవ్ మరణించారు.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఆహుతి ప్రసాద్. చాలా సినిమాల్లో ఆహుతీ ప్రసాద్ నటన అందరిని ఆకట్టుకుంది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు.. కొన్నిసినిమాల్లో ఆయన పండించిన సైలెంట్ కామెడీకి కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియన్స్. అయితే ఆహుతి ప్రసాద్ మాత్రం 60 ఏళ్లు రాకుండానే అతి చిన్న వయస్సులో మరణించారు. కాన్సర్ కారణంగా ఆయన 2015 జనవరి 4న 57 ఏళ్ళ వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
దిల్ సినిమాలో నటించిన తారలు కొంత మంది ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విచిత్రం ఏంటంటే ఆహుతీ ప్రసాద్ మరణించిన నెల రోజులు తిరక్క ముందే.. ఈసినిమాలో నటించని ఎమ్మెస్ నాయరణ కూడా చనిపోయారు. ఎమ్మెస్ నారాయణ లెక్చరర్ పాత్రలో నటించి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బాడీ లాంగ్వేజ్ తోనే కడుపుబ్బా నవ్వించి కామెడీ పండించిన ఎమ్మెస్.. అనారోగ్యం కారణంగా.. జనవరి 23న 2015న 63 ఏళ్ళ వయస్సులో మరణించారు.
ఈ సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా? ఆయన పేరు రాజన్ పి దేవ్, మలయాళ నటుడు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన రాజన్ పి దేవ్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో మెయిన్ విలన్ గా అద్భతంగా నటించారు. రాజన్ పి దేవ్ 58 ఏళ్ల వయస్సులో 2009 లో అనారోగ్య కారణాలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది టాలెంట్ ఉన్న నటులను కోల్పోయింది.