తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:57 PM (IST) Jul 02
Yashasvi Jaiswal: భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి అదిరిపోయే నాక్ ఆడాడు. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో దిగ్గజ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు.
11:34 PM (IST) Jul 02
Shubman Gill: ఇంగ్లాండ్ పై వరుసగా సెంచరీలు బాది శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డును సాధించాడు. భారత టెస్ట్ కెప్టెన్లలో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ప్లేయర్ గా ఘనత సాధించాడు.
10:53 PM (IST) Jul 02
Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యచ్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.
10:22 PM (IST) Jul 02
Airtel: మీరు డేటా ఎక్కువ ఉపయోగిస్తారా? 1 GB, 2 GB కూడా సరిపోవడం లేదా? అయితే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన కొత్త 3GB డేటా ప్లాన్లు మీకు కరెక్ట్ గా సరిపోతాయి. ఈ రీఛార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
10:19 PM (IST) Jul 02
PM Modi five nation tour: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘానా చేరుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఘానాలో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే. అక్కడ ఘన స్వాగతం లభించింది.
09:59 PM (IST) Jul 02
రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో మీ ఫోన్ భద్రత చాలా ముఖ్యం. కొన్ని చిన్న చిన్న మార్పులు లేదా అనుకోని యాక్టివిటీ మీ ఫోన్ హ్యాక్ అయిందని సూచిస్తుండొచ్చు. ఫోన్ హ్యాక్ అయిందని తెలిపే సంకేతాలు ఏమిటో తెలుసుకోండి.
09:20 PM (IST) Jul 02
India vs England Test: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. అయితే, ఇక్కడ సెంచరీలు సాధించిన భారత ప్లేయర్లు ఎవరో తెలుసా?
09:00 PM (IST) Jul 02
ఇకపై పీక్ అవర్స్ లో క్యాబ్ ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ సమయంలో డబుల్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు క్యాబ్ కంపనీలకు వెసులుబాటు లభించింది.
08:40 PM (IST) Jul 02
Medaram Jathara 2026: వచ్చే ఏడాది మేడారం జాతర జనవరి 28 నుండి 31 వరకు జరుగుతుంది. కోట్లాది భక్తులు హాజరయ్యే ఈ గిరిజన పండుగకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
07:18 PM (IST) Jul 02
తెలంగాణలో జులై 3, 4 తేదీల్లో కాలేజీలు బంద్ కానున్నాయి… మరో తెలుగు రాష్ట్రం ఏపీలో జులై 3న స్కూళ్లు మూతపడనున్నాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్ కు కారణాలేంటో తెలుసా?
06:03 PM (IST) Jul 02
car insurance: కారు నడపాలంటే కేవలం లైసెన్స్ ఉంటే సరిపోదు. పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఇలా కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. వాటిల్లో ఏది లేకపోయినా పోలీసులు మీకు ఫైన్ వేస్తారు. అయితే ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత కాలం జైలు శిక్ష వేస్తారో మీకు తెలుసా?
05:21 PM (IST) Jul 02
హైదరాబాద్‌లో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫ్లై ఓవర్స్‌కి మార్గం సుగుమమైంది.
05:16 PM (IST) Jul 02
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ లో ప్రత్యేక సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. శనివారం ఆప్షనల్ హాలిడే కాగా ఆదివారం సాధారణ సెలవు… అయితే సోమవారం కూడా సెలవు వచ్చే అవకాశాలున్నయి. ఈ సెలవులు ఎందుకో తెలుసా?
04:38 PM (IST) Jul 02
India vs England Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టులో మూడు కీలక మార్పులు జరిగాయి. అయితే, బుమ్రా జట్టు నుంచి అవుట్ కావడం, కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోవడం పై కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. భారత మళ్లీ తప్పు చేసిందా?
04:34 PM (IST) Jul 02
తక్కువ ధరలో ఎక్కువ RAM ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇన్ఫినిక్స్ Note 40X 5G ఫోన్ మీకు పర్ఫెక్ట్ సెలెక్షన్. ఇందులో ఏకంగా 12GB RAM అందిస్తున్నారు. దీని ధర కూడా కేవలం రూ.14,490లే. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మరింత వివరంగా తెలుసుకుందామా?
04:07 PM (IST) Jul 02
కొత్త కారు కొనుగోలు చేయాలని చలా మంది ఆశపడుతుంటారు. అయితే సరైన ఫైనాన్సియల్ ప్లానింగ్ లేకపోవడంతో భయంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే రూ. 40 వేల జీతం ఉన్నా చాలు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే కొత్త స్విఫ్ట్ కారును సొంతం చేసుకోవచ్చు. అదేలాగంటే..
03:47 PM (IST) Jul 02
India vs England Test: ఇంగ్లాండ్‌తో రెండవ టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు కూర్పులో మూడు మార్పులు చేశారు. ప్రస్తుతం భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.
03:31 PM (IST) Jul 02
మీకు రూ.60 వేల కంటే తక్కువకే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 92 కి.మీ. ప్రయాణించేలా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని హీరో కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్స్, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.
02:57 PM (IST) Jul 02
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పెరిగిన మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా యువతలో ఆకస్మిక మరణాలు షాక్‌కి గురి చేశాయి.
02:56 PM (IST) Jul 02
ధనుష్ నటించిన రీసెంట్ హిట్ మూవీ కుబేర. ఈ సినిమా కథను డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ కోసం రాయలేదా? కుబేర సినిమాను మిస్ అయిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరు?
02:18 PM (IST) Jul 02
తెెలుగు ప్రజలకు అద్భుత అవకాశం. సముద్ర అలలపై తేలియాడుతూ, సకల సౌకర్యాలను పొందుతూ ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాాం.
02:15 PM (IST) Jul 02
విద్యార్థులు మొదలు ఉద్యోగుల వరకు ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం అనివార్యంగా మారింది. సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పే ల్యాప్‌టాప్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
01:01 PM (IST) Jul 02
వివాహం కేవలం రెండు వ్యక్తుల మధ్య శారీరక బంధమేకాదు ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసం, సమన్వయాన్నికలిపే గొప్ప బంధం. ఇలాంటి అనుబంధంలో తొలి రాత్రి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇది మధురస్మృతి కావాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
11:35 AM (IST) Jul 02
ఒకప్పుడు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ స్థానాన్ని చాట్ జీపీటీ భర్తీ చేస్తోంది. చివరికి ఆర్థిక సలహాలు కూడా ఇస్తోంది. తాజాగా ఓ మహిళ క్రెడిట్ కార్డు బిల్లును చాట్ జీపీటీ సహాయంతో క్లియర్ చేసింది.
10:50 AM (IST) Jul 02
వారి ప్రేమకు ఊపిరిపోసిన కంపెనీయే చివరకు ఊపరి తీసింది. సిగాచి కంపెనీ ప్రమాదంలో పెళ్ళికి సిద్దమైన యువ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయారు. వీరి కన్నీటి కథ అందరితో కంటతడి పెట్టిస్తోంది.
10:03 AM (IST) Jul 02
ప్రముఖ బాలీవుడ్ నటి పెఫాలీ జరీవాలా మరణం అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా గ్లామర్‌గా కనిపించే పెఫాలీ ఉన్నట్లుండి గుండెపోటుతో మరణించారు. దీంతో ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
08:10 AM (IST) Jul 02
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జులై 2న భారీ వర్షాల హెచ్చరిక. తుఫానులు, పిడుగులు, ఈదురుగాలులతో ఇవాళ ఏ జిల్లాల్లో వానలు కురుస్తాయో తెలుసుకోండి.