MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Yashasvi Jaiswal: రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యచ్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2025, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఇన్నింగ్స్
Image Credit : ANI

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఇన్నింగ్స్

భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. రెండో టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 107 బంతుల్లో 87 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు బాదాడు.

ఈ ఇన్నింగ్స్‌తో పాటు జైస్వాల్ ఇప్పుడు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA దేశాలు)లలో ఓపెనర్‌గా ఐదు అర్ధసెంచరీలతో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ ఖాతాలో నాలుగు మాత్రమే ఉన్నాయి.  జైస్వాల్ కేవలం 21 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
Image Credit : ANI

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. 

అయితే యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. నాయర్ 31 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో వికెట్ ను సమర్పించుకున్నాడు.

జైస్వాల్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరోసారి సెంచరీకి దాదాపు చేరువయ్యాడు. అయితే, లంచ్‌ బ్రేక్ కు ముందు ఓ వైడ్ బంతిని కట్ చేయబోయి స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ గా దొరికిపోయాడు.

36
ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఓపెనర్ గా జైస్వాల్ రికార్డు
Image Credit : Getty

ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఓపెనర్ గా జైస్వాల్ రికార్డు

ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి జైస్వాల్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సుధీర్ నాయిక్ పేరిట ఉండగా, ఆయన 1974లో 77 పరుగులు చేశారు. 

ఇప్పుడు జైస్వాల్ 87 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు, సునీల్ గవాస్కర్ 1979లో 68, 61 పరుగులు చేయగా, ఛతేశ్వర్ పుజారా 2022లో 66 పరుగులు చేశారు.

46
2000 టెస్ట్ పరుగులకు చేరువైన యశస్వి జైస్వాల్
Image Credit : Getty

2000 టెస్ట్ పరుగులకు చేరువైన యశస్వి జైస్వాల్

ప్రస్తుతం జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో 2000 పరుగుల మార్క్‌కు కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనతను వేగంగా సాధించిన భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌లు 40 ఇన్నింగ్స్‌లలో ఆ రికార్డు సాధించారు.

 జైస్వాల్ అదే సంఖ్యలో పూర్తిచేయాలంటే రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 పరుగులు చేయాల్సి ఉంటుంది.

56
తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్
Image Credit : ANI

తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్

అంతకుముందు, లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేసి, జట్టుకు తీవ్ర నష్టం కలిగించాడు.

66
సెంచరీతో కెప్టెన్ నాక్ ఆడిన శుభ్ మన్ గిల్
Image Credit : ANI

సెంచరీతో కెప్టెన్ నాక్ ఆడిన శుభ్ మన్ గిల్

రెండో టెస్టులో కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీని పూర్తి చేశాడు. వరుసగా రెండో టెస్టులో సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం గిల్ 109 పరుగులతో ఆడుతున్నాడు. భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. క్రీజులో గిల్, రవీంద్ర జడేజా (39* పరుగులు)లు ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs ENG: బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ లేడు.. భారత్ మళ్లీ తప్పుడు నిర్ణయం తీసుకుందా?
Recommended image2
Ind vs Eng: ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved