- Home
- Business
- Hero Vida VX2: ఒక్క ఛార్జ్ తో 92 కి.మీ. ప్రయాణం: అదిరిపోయే ఫీచర్స్‌తో హీరో Vida VX2 వచ్చేసింది
Hero Vida VX2: ఒక్క ఛార్జ్ తో 92 కి.మీ. ప్రయాణం: అదిరిపోయే ఫీచర్స్‌తో హీరో Vida VX2 వచ్చేసింది
మీకు రూ.60 వేల కంటే తక్కువకే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 92 కి.మీ. ప్రయాణించేలా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని హీరో కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్స్, ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.

రూ.59,490 లకే Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్
హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం Vida తాజాగా తన రెండవ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ చేసిన Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ ధరకే కంపెనీ అందిస్తోంది. హీరో కంపెనీ అందిస్తున్న వెహికల్స్ లో తక్కువ ధరలో లభ్యమవుతున్న తొలి మోడల్‌గా Vida VX2 నిలిచింది. ఇది Battery-as-a-Service (BaaS) మోడల్‌లో రూ.59,490 (ఎక్స్‌షోరూమ్) ధరకు అందుబాటులోకి వచ్చింది.
కిలోమీటరుకు కేవలం రూ.0.96 పైసలే ఖర్చు
ఈ VX2 స్కూటర్ ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన యాజమాన్యాన్ని మరింతగా సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త మోడల్‌లో pay-per-kilometre ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ప్రకారం వినియోగదారులు కిలోమీటరుకు కేవలం రూ.0.96 చెల్లిస్తే సరిపోతుంది.
రెండు వేరియంట్‌లుగా VX2
VX2 స్కూటర్‌ను రెండు వేరియంట్‌లుగా అందిస్తున్నారు. అవి VX2 Go, VX2 Plus. ఈ స్కూటర్ BaaS మోడల్‌లో VX2 Go వేరియంట్ ధర రూ.59,490 కాగా, VX2 Plus వేరియంట్ ధర రూ.64,990. అయితే బ్యాటరీతో కలిపి కొనాలనుకునే వారు VX2 Go ని రూ.99,490కి, VX2 Plus ను రూ.1,09,990కి కొనుగోలు చేయవచ్చు.
డిజైన్, పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..
డిజైన్ పరంగా VX2 స్కూటర్ Vida Z మోడల్ డిజైన్‌ను అనుసరిస్తుంది. LED టెయిల్ ల్యాంప్, 12 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఇందులో సింగిల్ పీస్ స్టెప్డ్ సీట్ కూడా ఉంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే VX2 Goలో 2.2 kWh స్వాప్ చేయగల బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది. VX2 Plusలో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 142 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రెండు వేరియంట్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. 80 శాతం ఛార్జ్‌కి దాదాపు 60 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది.
మూడురకాల ఛార్జింగ్ ఆప్షన్లు
VX2 రెండు వేరియంట్ వెహికల్స్ లో మూడురకాల ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంట్లోనైనా, బయటైనా ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. Vida తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కూటర్లలోని 12 అంగుళాల వీల్స్ తమ సొంత క్లాస్‌లో అతి వెడల్పైనవిగా ఉంటాయి.
ఫీచర్లు విషయానికి వస్తే VX2 Goలో 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే, VX2 Plusలో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. రెండు వేరియంట్‌లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రియల్‌టైమ్ రైడ్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, క్లౌడ్ ఆధారిత భద్రతా వ్యవస్థలు, OTA (Over-The-Air) అప్డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.