- Home
- Automobile
- Cars
- Car: కొత్త కారు కొనడం పెద్ద కష్టమేం కాదు బాసూ.. 30 - 15 - 5 రూల్ ఫాలో అయితే ఈ స్విఫ్ట్ మీ సొంతం
Car: కొత్త కారు కొనడం పెద్ద కష్టమేం కాదు బాసూ.. 30 - 15 - 5 రూల్ ఫాలో అయితే ఈ స్విఫ్ట్ మీ సొంతం
కొత్త కారు కొనుగోలు చేయాలని చలా మంది ఆశపడుతుంటారు. అయితే సరైన ఫైనాన్సియల్ ప్లానింగ్ లేకపోవడంతో భయంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే రూ. 40 వేల జీతం ఉన్నా చాలు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే కొత్త స్విఫ్ట్ కారును సొంతం చేసుకోవచ్చు. అదేలాగంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
కొత్త స్విఫ్ట్ కారు ధర ఎంతంటే.?
మారుతి సుజుకీ స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 6 లక్షలుగా ఉంది. ఇన్సూరెన్స్ రూ. 35,000 అలాగే రోడ్ ట్యాక్స్, ఆర్టీఓ ఛార్జీలు రూ. 50,000, సెస్, మిస్క్ ఛార్జీలు రూ. 10,000 ఉంటుంది. మొత్తంగా కలుపుకుంటే ఈ కారు ఆన్‌రోడ్ ధర రూ. 6,95,000 ఉటుంది. అయితే ఈ ధర ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
30-15-5 రూల్.
ఈ విధానాన్ని పాటిస్తే మీరు సులభంగా కారును సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీరు ముందుగా కచ్చితంగా కారు డౌన్ పేమెంట్‌ను 30 శాతం పెట్టాల్సి ఉంటుంది. అంటే కనీసం రూ. 2,08,500 మీ చేతిలో ఉండాలి. ఇక మీరు కారుకు చెల్లించాల్సి ఈఎమ్ఐ మీకు వచ్చే జీతంలో 15 వతం ఉండాలి. ఈ లెక్కన మీరు నెలకు సుమారు రూ. 10 వేల ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు 5 ఏళ్లపాటు చెల్లించాలి. 50 వేల జీతం ఉన్న వారు నెలకు రూ. 10 వేలు కారు ఈఎమ్ఐ చెల్లించడం సులభమే అవుతుంది.
స్విఫ్ట్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
మారుతీ స్విఫ్ట్ 2025లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది 82 bhp పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఇంధన వినియోగం తగ్గి, స్మూత్ డ్రైవింగ్ అనుభూతినిస్తుంది.
మంచి మైలేజ్
ARAI అంచనా ప్రకారం, స్విఫ్ట్ 2025 25.72 కి.మీ./లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇది గత మోడళ్లతో పోలిస్తే ఇది మెరుగైంది. హైబ్రిడ్ సిస్టమ్ వల్ల ఇంధన పొదుపు పెరగడంతో పాటు, పవర్‌లో కూడా తగ్గుదల ఉండదు. ముందువైపు గ్రిల్, LED హెడ్‌లైట్స్, రీడిజైన్ చేసిన బంపర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో 9 ఇంచెస్‌తో కూడిన టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
అధునాతన సేఫ్టీ ఫీచర్లు
ఇక ఈ కారులో భద్రత ఫీచర్లకు కూడా పెద్ద పీట వేశారు. మారుతీ స్విఫ్ట్ 2025లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ABSతో పాటు EBD, 360-డిగ్రీ కెమెరా వంటి అత్యవసర భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.