- Home
- Business
- Infinix Note 40X 5G: రూ.14,490కే 12GB RAM, 108MP కెమెరా కలిగిన కొత్త ఫోన్.. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ఫోన్ లాంచ్
Infinix Note 40X 5G: రూ.14,490కే 12GB RAM, 108MP కెమెరా కలిగిన కొత్త ఫోన్.. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G ఫోన్ లాంచ్
తక్కువ ధరలో ఎక్కువ RAM ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇన్ఫినిక్స్ Note 40X 5G ఫోన్ మీకు పర్ఫెక్ట్ సెలెక్షన్. ఇందులో ఏకంగా 12GB RAM అందిస్తున్నారు. దీని ధర కూడా కేవలం రూ.14,490లే. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మరింత వివరంగా తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
రూ.15,000లోపు బడ్జెట్‌లో 12GB RAM
తక్కువ ఖర్చుతో ఎక్కువ RAM కావాలనుకొనే వారి కోసం ఇన్ఫినిక్స్ మొబైల్స్ భారత మార్కెట్లో తమ లేటెస్ట్ 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలో ప్రీమియమ్ ఫీచర్లు అందిస్తోంది. ముఖ్యంగా రూ.15,000లోపు బడ్జెట్‌లో 12GB RAM లభించే అరుదైన ఫోన్‌లలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఎక్కువ RAM కెపాసిటీ ఉండటం వల్ల ఫోన్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది.
అమెజాన్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోండి
అమెజాన్ వేదికగా ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.14,490కి అందిస్తోంది. సాధారణంగా 12GB RAM ఫోన్‌లు ఈ ధరలో దొరకడం చాలా అరుదు. మార్కెట్లో రూ.14,999కే లభించే Vivo T4x 5G, Realme 14x 5G లకు ఈ ఫోన్ గట్టి పోటీగా మారనుంది.
Infinix Note 40X 5G ఫోన్ ప్రత్యేకతలు ఏంటంటే..
డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: ఈ డివైస్‌లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ వాడారు. తక్కువ ధరలో ఇంత మంచి ప్రాసెసర్ ఉండటం చాలా అరుదు.
RAM: Infinix Note 40X 5G ఫోన్ బేస్‌గా 12GB RAM లభిస్తుంది. మీరు కావాలంటే అదనంగా 12GB వర్చువల్ RAMను కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అంటే మొత్తంగా 24GB వరకు RAM విస్తరించుకోవచ్చు.
బ్యాటరీ, కెమెరా పనితీరు ఎలా ఉందంటే..?
ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, డ్యూయల్ స్పీకర్స్, Bluetooth 5.2, Wi-Fi 5.0 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
హై-రిసల్యూషన్ కెమెరా దీని ప్రత్యేకత
ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో లేదు. కానీ అమెజాన్‌లో స్పెషల్ ధరకు లభ్యమవుతోంది. 12GB RAM, పెద్ద స్క్రీన్, హై-రిసల్యూషన్ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు సరైన ఎంపికగా కనిపిస్తోంది.