- Home
- Business
- ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: రోజుకు 3GB డేటా.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు ఉచితంగా పొందొచ్చు
ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: రోజుకు 3GB డేటా.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు ఉచితంగా పొందొచ్చు
Airtel: మీరు డేటా ఎక్కువ ఉపయోగిస్తారా? 1 GB, 2 GB కూడా సరిపోవడం లేదా? అయితే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన కొత్త 3GB డేటా ప్లాన్లు మీకు కరెక్ట్ గా సరిపోతాయి. ఈ రీఛార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

84 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటా ప్లాన్
ఇప్పుడంతా ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, క్రికెట్, ఇలా ఏదైనా ఓటీటీ ప్లాట్ ఫాంలను ఉపయోగించి చూస్తున్నారు. మరి ఇలాంటి వినోద కార్యక్రమాలు చూడటానికి ఎక్కువ డేటా అవసరం. ఉచిత యాప్ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా అవసరం. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఉచిత డేటా, నెట్‌ఫ్లిక్స్ వంటివి ఈ ఆఫర్‌లో ఉన్నాయి. ఈ ప్లాన్ తో పాటు ఇతర 3GB డేటా ప్లాన్ల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
1,798 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ప్రతిరోజూ 3 GB ఉచిత హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌తో సహా కొన్ని OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ మీరు పొందాలంటే రూ.1,798 చెల్లించాలి. ఈ ప్లాన్ ఖరీదైనదే అయినప్పటికీ దీని ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇంట్లో కూర్చుని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ద్వారా సిరీస్‌లు, సినిమాలు చూసే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
449 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఎయిర్‌టెల్ ఇప్పుడు తన కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డేటా వంటి వినోద ప్రణాళికలను అందిస్తోంది. వీటిలో మొదటి ప్లాన్ రూ.449 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల చెల్లుబాటు ప్లాన్. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 3 GB డేటా ఉచితంగా లభిస్తుంది. మొత్తం 22 OTT ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో సోనీ లైవ్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి.
838 రూపాయల రీఛార్జ్ ప్లాన్
మీరు ఈ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకుంటే మీకు ప్రతిరోజూ 3GB డేటా ఉచితంగా లభిస్తుంది. అదనంగా మీరు అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ పూర్తిగా ఉచితంగా యాక్సిస్ చేయొచ్చు. ఇది 56 రోజుల చెల్లుబాటు అయ్యే ప్లాన్. అంటే దాదాపు 2 నెలల పాటు రోజుకు 3GB డేటా లభిస్తుంది.
598 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటే మీకు ప్రతిరోజూ 2 GB ఉచిత డేటా లభిస్తుంది. ఇది ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అదనంగా మీరు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్‌స్టార్‌తో సహా కొన్ని ఇతర ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందుతారు. మీరు ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
1029 రూపాయల రీఛార్జ్ ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లకు 84 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. రోజుకు 2 GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాలు ఉన్నాయి. JioHotstarతో సహా అనేక OTT ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా లభిస్తాయి.
అదేవిధంగా రూ.1199 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లైట్ ఇతర సౌకర్యాలు లభిస్తాయి. ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.