Cab fare hike alert : హైదరబాదీలు జాగ్రత్త... ఈ టైమ్ లో క్యాబ్ ఎక్కారో జేబులు ఖాళీ
ఇకపై పీక్ అవర్స్ లో క్యాబ్ ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఈ సమయంలో డబుల్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు క్యాబ్ కంపనీలకు వెసులుబాటు లభించింది.

క్యాబ్ ధరలు పెంపు
మీరు ఆన్ లైన్ లో క్యాబ్ సర్వీసులను అందించే యాప్స్ ను వాడుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్త. మీనుండి ఈ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులు రద్దీ సమయాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయనున్నాయి. ఈమేరకు వారికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం క్యాబ్ కంపెనీలు పీక్ అవర్స్‌లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు.
కేంద్రం కీలక నిబంధనలు
ప్రభుత్వం ప్రయాణికులకు ఓవర్‌ఛార్జింగ్ కాకుండా కూడా చూసుకుంది. ఆఫ్-పీక్ సమయాల్లో ఛార్జీలు సాధారణ ధరలో 50% కంటే తక్కువ ఉండకూడదు. ఈ మార్పులు కొత్త మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 కింద వస్తున్నాయి, ఇవి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్‌కు న్యాయం, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్
దేశంలోని ప్రధాన నగరాల్లో చాలామంది ఈ యాప్ ఆధారిత టాక్సీలు, బైక్ రైడ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది సౌకర్యం కాదు అవసరం... రోజువారీ ప్రయాణాలకు జీవనాధారం. కానీ పట్టణాల్లో రద్దీ పెరుగుతున్న కొద్దీ, ఖర్చులు పెరుగుతున్న కొద్దీ స్పష్టమైన, న్యాయమైన ధరల నిర్ణయించడం చాలా అవసరం.
కేంద్రం డ్రైవర్లకు అనుకూలంగా కూడా నిర్ణయాలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి క్యాబ్ కంపెనీ డ్రైవర్‌కు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, రూ. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించాలి. పట్టణ రవాణాకు వెన్నెముకగా ఉన్న గిగ్ కార్మికులకు ఇది ఒక పెద్ద భద్రత.
క్యాబ్ ధరల నిర్ణయం రాష్ట్రాలదే
కేంద్ర ప్రభుత్వం నూతన ఈ మార్గదర్శకాలను తదుపరి మూడు నెలల్లోపు అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. వాస్తవ ధర, డ్రైవర్ కమిషన్ నమూనాలను నిర్ణయించడం రాష్ట్రాల ఇష్టం. ఒక రాష్ట్రం ఇంకా ఛార్జీలను నిర్ణయించకపోతే క్యాబ్ కంపెనీలు తమ సొంత ప్రాథమిక ఛార్జీని స్పష్టంగా ప్రకటించాలి.
ప్రయాణికులు గమనించాల్సిన మరో విషయం "డెడ్ మైలేజ్" ఛార్జీలు... అంటే డ్రైవర్ మీ వద్దకు చేరుకోవడానికి ప్రయాణించే దూరానికి చెల్లించేది. మీ పికప్ పాయింట్ 3 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఇది వర్తిస్తుంది. ఇది అనవసరమైన ఛార్జీలను తగ్గించడం, చిన్న దూర ప్రయాణాలను మరింత న్యాయంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
బైక్ టాక్సీలకు కూడా శుభవార్త
రాపిడో వంటి బైక్ టాక్సీ సేవలకు ఈ ప్రకటన ఉపశమనంగా కనిపిస్తోంది... చాలా కాలంగా ఇవి నియంత్రణ లేకుండా పనిచేస్తున్నాయి. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో, బైక్ టాక్సీలపై నిషేధం పెద్ద అంతరాయాలకు, నిరసనలకు కారణమైంది… ఈ స్పష్టమైన నిబంధనలు భవిష్యత్తులో సున్నితమైన కార్యకలాపాలను అనుమతించవచ్చు.
ఉబర్ వంటి కంపెనీలు ఈ చర్యను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు, డ్రైవర్లు, ప్రభుత్వాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైనదిగా పేర్కొంటున్నాయి. రాష్ట్రాలు సకాలంలో వీటిని అమలు చేయడం అవసరమని పేర్కొంది. కేంద్రం సంప్రదింపుల విధానాన్ని మేము అభినందిస్తున్నామని ఉబర్ పేర్కొంది.

