Laptop: ల్యాప్‌టాప్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.? అసలు ఈ పేరు ఎలా వచ్చింది.
విద్యార్థులు మొదలు ఉద్యోగుల వరకు ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం అనివార్యంగా మారింది. సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పే ల్యాప్‌టాప్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ల్యాప్‌టాప్ అంటే ఏంటి?
ల్యాప్‌టాప్ అనేది చిన్న, తేలికపాటి కంప్యూటర్. ఇది ఒకే డివైస్‌లో స్క్రీన్, కీబోర్డ్, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని కలిపి వస్తుంది. డెస్క్‌టాప్‌లతో పోల్చితే ఎన్నో భిన్నమైన, అధునాతన ఫీచర్లు ల్యాప్‌టాప్‌లో ఉంటాయి. దీనిని ఎక్కడైనా తీసుకెళ్లి ఉపయోగించవచ్చు. ఈ కారణంగా ఇది విద్య, వ్యాపారం, వినోదం ఇలా అన్ని రంగాల్లో భాగం అయింది.
ల్యాప్‌టాప్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా?
“ల్యాప్” అంటే మన మోకాళ్ల మీద భాగం (ఒడి), “టాప్” అంటే పైన ఉంచే వస్తువు. అంటే ల్యాప్‌పై ఉంచుకుని వాడే కంప్యూటర్‌కు ల్యాప్‌టాప్ అనే పేరు వచ్చింది. ఈ పదం మొదటగా 1980లలో వినిపించింది. Gavilan SC అనే కంప్యూటర్ 1983లో వచ్చినప్పుడు “ల్యాప్‌టాప్” అనే పదాన్ని ఉపయోగించారు. ఇది తొలిసారిగా నిజమైన పోర్టబుల్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందింది.
ల్యాప్‌టాప్ ఫుల్ ఫాం ఏంటి?
ల్యాప్‌టాప్‌కు సాధారణంగా గుర్తింపు ఉన్న ఫుల్ ఫాం అనేది ఏం లేదు. కానీ కొందరు మాత్రం LAPTOP = Light-weight Analytical Platform with Total Optimized Power అని నమ్ముతారు. అయితే దీనిని అధికారికంగా గుర్తించలేదు. ఒడిపై పెట్టుకునే వస్తువు అనే అర్థం మాత్రమే తప్ప దీనికి ప్రత్యేకంగా అబ్రివేషన్ లేదంటారు.
ల్యాప్‌టాప్ ఉపయోగాలు ఏంటి.?
ఎడ్యుకేషన్‌లో టెక్నాలజీ వినియోగం పెరిగిన ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ కోసం ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక బిజినెస్‌లో కూడా ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రెజెంటేషన్‌లు తయారుచేయడం, అకౌంట్స్ నిర్వహించడం, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఇవన్నీ ల్యాప్‌టాప్ ద్వారానే జరుగుతాయి.
ఇతర రంగాల్లో కూడా
సినిమాలు చూడడం, గేమ్స్ ఆడటం, పాటలు వినడం వంటి వినోద రంగంలో కూడా ల్యాప్‌టాప్ ఉపయోగపడుతుంది. కేవలం చూడడానికే కాదు కంటెంట్ క్రియేషన్‌కు కూడా ల్యాప్‌టాప్ అవసరం ఉంటుంది. డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, మ్యూజిక్ కంపోజింగ్ వంటి సృజనాత్మక పనులు కూడా ల్యాప్‌టాప్ సహాయంతో చేయవచ్చు.
బిల్ పేమెంట్స్, ఆన్‌లైన్ షాపింగ్, వీడియో కాల్స్, పర్సనల్ నోట్స్ నిర్వహించడం వంటివన్నీ ల్యాప్‌టాప్‌తో చేయొచ్చు. ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ ఉంటుంది. కరెంట్ లేకపోయినా కొన్ని గంటలు పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి కాబట్టే ల్యాప్‌టాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.