PM Modi five nation tour: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘానా చేరుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఘానాలో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే. అక్కడ ఘన స్వాగతం లభించింది.

PM Modi five nation tour: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటనను బుధవారం ఘానాతో ప్రారంభించారు. ఇది మోడీ తన ప్రథమ ద్వైపాక్షిక పర్యటనగా ఉండడమే కాకుండా, గత 30 సంవత్సరాలలో ఘానాను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా నిలిచారు.

ఘానా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఆహ్వానంతో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లారు. పీఎం మోడీకి ఘానా రాజధాని అక్రాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు గౌరవ వందనం, 21 గన్ సెల్యూట్‌తో అద్భుత స్వాగతం లభించింది.

Scroll to load tweet…

భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. "నేడు మన మధ్య చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, పెట్టుబడులు, శక్తి, ఆరోగ్యం, భద్రత, సామర్థ్యాభివృద్ధి, అభివృద్ధి భాగస్వామ్యం వంటి రంగాలలో కొత్త అవకాశాలు అన్వేషించాలన్న ఆశతో ఈ పర్యటన జరుగుతోంది" అని పేర్కొన్నారు.

అలాగే, "ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఘానా పార్లమెంటులో ప్రసంగం చేయడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని ప్రధాని మోడీ అన్నారు.

Scroll to load tweet…

ఈ పర్యటనలో భాగంగా మోడీ, ఘానా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, ఆర్థిక సహకారం, ఇంధన రంగం, రక్షణ సహకారం తదితర విషయాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది.

ఘానా గ్లోబల్ సౌత్‌లో కీలక భాగస్వామి

ప్రధాని మోడీ తన పర్యటనకు ముందు చేసిన ప్రకటనలో.. "ఘానా గ్లోబల్ సౌత్‌లో ఒక కీలక భాగస్వామి. ఇది ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమ ఆఫ్రికన్ రాష్ట్రాల ఆర్థిక సముదాయమైన ECOWASలో ముఖ్యపాత్ర పోషిస్తోంది" అని పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్-ఘానా మధ్య వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.

Scroll to load tweet…

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలు ఇవే

జూలై 3, 4: ట్రినిడాడ్ & టొబాగో పర్యటనలో ప్రధాని మోడీ

ఘానా తర్వాత ప్రధాని మోcw జూలై 3 నుంచి 4 వరకూ ట్రినిడాడ్ & టొబాగో (T&T) అధికార పర్యటన చేపడతారు. ఆ దేశ అధ్యక్షులు క్రిస్టీన్ కార్లా కంగాలూతో పాటు, ఇటీవల మళ్ళీ పదవిలోకి వచ్చిన ప్రధాని కమల ప్రసాద్-బిస్సేసర్ ను కలవనున్నారు.

ట్రినిడాడ్ & టొబాగో పర్యటన క్రమంలో ప్రధాని మోడీ.. “భారతీయులు తొలిసారిగా 180 సంవత్సరాల క్రితం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వచ్చారు. ఈ పర్యటన మన పూర్వీకుల స్మృతులను, బంధాలను పునరుజ్జీవింపజేస్తుంది” అని అన్నారు.

Scroll to load tweet…

జూలై 4, 5: ఆర్జెంటీనా పర్యటనలో ప్రధాని మోడీ

జూలై 4 నుంచి 5 వరకూ ప్రధాని మోడీ ఆర్జెంటీనాలో పర్యటిస్తారు. ఇది గత 57 సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి చేయనున్న తొలి ద్వైపాక్షిక పర్యటన. ప్రధాని జేవియర్‌ మిల్లా తో కీలక చర్చలు జరగనున్నాయి.

“ఆర్జెంటీనా టీ20లో భారత్‌కు మంచి భాగస్వామి. వ్యవసాయం, ఖనిజాలు, ఇంధన వనరులు, టెక్నాలజీ, పెట్టుబడులు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై చర్చ జరుగుతుంది” అని మోడీ వెల్లడించారు.

జూలై 6, 7: బ్రెజిల్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ

ఆర్జెంటీనా పర్యటన తర్వాత ప్రధాని మోడీ జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు ప్రపంచ నాయకులతో సమావేశాలు జరుగుతాయి. అలాగే, బ్రాసీలియాకు అధికార పర్యటనకు వెళ్తారు.

“బ్రిక్స్ స్థాపక సభ్యులలో ఒకరైన భారత్, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం పెంపొందించేందుకు కట్టుబడి ఉంది. ఈ పర్యటన ద్వారా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తో కలిసి గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలపై చర్చించనున్నాను” అని ప్రధాని మోడీ తెలిపారు.

Scroll to load tweet…

నామీబియాతో పర్యటన ప్రధాని మోడీ విదేశీ టూర్ ముగింపు

ఈ ఐదు దేశాల పర్యటనలో చివరిగా ప్రధాని మోడీ నామీబియాలో పర్యటిస్తారు. నామీబియా, భారత్‌తో భిన్నమైన చరిత్రతో సహా, వలసవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసిన దేశంగా గుర్తింపు పొందింది. ఇది భారత్‌కు విశ్వసనీయ భాగస్వామిగా ఉంది.

ఈ పర్యటన మొత్తం భారత విదేశాంగ విధానానికి గణనీయమైన ప్రాధాన్యతను అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ సౌత్‌తో సంబంధాలు బలోపేతం కావడమే కాకుండా, కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాల దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

Scroll to load tweet…