తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:24 PM (IST) Jun 19
India vs England: 2007లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పుడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా అదే విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది.
10:15 PM (IST) Jun 19
UGC NET 2025: యూజీసీ నెట్ 2025 జూన్ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల అయింది. జూన్ 25 నుంచి 29 వరకు సీబీటీ మోడ్ లో పరీక్షలు జరగనున్నాయి.
10:04 PM (IST) Jun 19
యోగా డే సందర్భంగా తెలుగు విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. కేవలం ఇక్కడి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఇంతకూ ఆ ప్రాంతమేది ఏది? ఎందుకు ఇన్నిరోజులు సెలవు ఇస్తున్నారు? ఇక్కడ తెలుసుకుందాం.
09:33 PM (IST) Jun 19
Banakacharla: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
08:08 PM (IST) Jun 19
Chandrababu Naidu: బనకచర్ల రచ్చపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. నీటి సమస్యపై రాజకీయాలు వద్దని అన్నారు. శాంతియుతంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందాని చెప్పారు.
06:41 PM (IST) Jun 19
Israel Iran conflict: ఇజ్రాయెల్‌లో జరిగిన బాంబుదాడుల కారణంగా తెలంగాణకు చెందిన రవీంద్ర గుండెపోటుతో మృతి చెందారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం క్రమంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియా ఆపరేషన్ సింధూను ప్రారంభించింది.
05:12 PM (IST) Jun 19
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తులం బంగారం ధర రూ. లక్ష దాటేసింది. అయితే రానున్న రోజుల్లో వెండి ధరలు కూడా భారీగా పెరగనున్నాయని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
05:08 PM (IST) Jun 19
Trump Munir lunch meme fest: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వైట్ హౌస్ భేటీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారాయి. ట్రంప్, మునీర్, పాకిస్తాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు.
04:53 PM (IST) Jun 19
మీకు తెలుసా? మన నివసిస్తున్న భూమిని నీటి గ్రహం అంటారని.. ఎందుకంటే ఈ భూమ్మీద మూడు వంతుల నీరే ఉంది. ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఇంత నీరున్నా అసలు నదులే లేని కొన్ని దేశాలున్నాయి. అవేంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
04:37 PM (IST) Jun 19
చాలామంది తక్కువ జీతానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. నెలంతా కష్టపడినా 20 వేల నుంచి 30 వేలు కూడా రాని పరిస్థితి. అయితే కొన్ని వ్యాపారాలతో ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఓసారి చూసేయండి.
04:23 PM (IST) Jun 19
గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
03:28 PM (IST) Jun 19
టాటా హ్యారియర్ EV AWD మోడల్ ‘క్వాడ్ డే’ ఈవెంట్ లో తన సత్తా చాటింది. ఎలాంటి రోడ్డులోనైనా సునాయాసంగా ప్రయాణించి ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. హ్యారియర్ EV ప్రత్యేకతలు, మైలేజ్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
03:21 PM (IST) Jun 19
సొంత కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఖరీదైన విషయం కావడంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ బ్యాంకులు రుణాలు ఇస్తున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఈఎమ్ఐతో కారును సొంతం చేసుకునే అవకాశం ఉంది.
02:56 PM (IST) Jun 19
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఏఏ అసెంబ్లీల్లో ఎందుకు ఉపఎన్నికలు జరుగుతున్నాయో తెలుసా?
02:10 PM (IST) Jun 19
Bengaluru: ప్రముఖ ఐటీ నగరం బెంగళూరులో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్న సమయంలో ఊహించని విధంగా మానవ అస్థిపంజరాలు బయట పడ్డాయి.
01:23 PM (IST) Jun 19
మీకు ఓటర్ ఐడీ కార్డు కావాలా..? ఇలాచేసారో కేవలం 15 రోజుల్లోనే కార్డు మీ చేతిలో ఉంటుంది. కొత్త కార్డును పొందడం కూడా ఇక చాలా ఈజీ.
01:13 PM (IST) Jun 19
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ తన పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా పెరుగుతోన్న కేసులే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
12:53 PM (IST) Jun 19
సొంత ఊర్లోనే ఉండాలనుకొనే వారికి మంచి ఆదాయాన్నిచ్చే బిజినెస్ తేనెటీగల పెంపకం. తక్కువ పెట్టుబడి, శ్రమ ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ చక్కటి మార్గం. ఇందులో లాభనష్టాలు, కష్టసుఖాలు, డెవలప్‌మెంట్‌కి ఉన్న అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం.
12:23 PM (IST) Jun 19
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ట్రంప్ తాజాగా భారతదేశం విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
11:15 AM (IST) Jun 19
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ప్రాజెక్ట్? దీనిపై వివాదమేంటి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
11:01 AM (IST) Jun 19
కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్‌కు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రోయోషియాతో పాటు సైప్రస్ దేశాలను పర్యటించారు. అయితే మోదీ సైప్రస్ పర్యటన వెనకాల చాలా పెద్ద ఎత్తుగడ ఉందన్న విషయం మీకు తెలుసా.?
08:45 AM (IST) Jun 19
తెలుగు రాష్ట్రాల్లో మరో ఆర్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవట. మరి ఎప్పట్నుంచి వానలు జోరందుకునే అవకాశాలున్నాయట తెలుసా?