Car: రూ. 68 వేలు డౌన్‌పేమెంట్, నెలకు రూ. 10 వేలు EMI కడితే చాలు.. ఈ కారు మీ సొంతం
సొంత కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఖరీదైన విషయం కావడంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ బ్యాంకులు రుణాలు ఇస్తున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఈఎమ్ఐతో కారును సొంతం చేసుకునే అవకాశం ఉంది.
- FB
- TW
- Linkdin
Follow Us

టాటా పంచ్ కారు
2024లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా టాటా పంచ్ నిలిచింది. ఇందులోని సేఫ్టీ ఫీచర్లు, ధర ఈ కారుకు ఆదరణ లభించడానికి కారణాలు చెప్పొచ్చు. Global NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో పంచ్‌కు 5 స్టార్ రేటింగ్ లభించింది. ఇది భారతీయ వినియోగదారులలో గట్టి నమ్మకాన్ని ఏర్పరిచింది.
ధరకు సంబంధించిన వివరాలు
టాటా పంచ్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ వేరియంట్ ధర రూ. 6 లక్షలుగా ఉంది. కాగా గరిష్ట ధర రూ. 10.32 లక్షలుగా ఉంది. ఈ కారును మొత్తం 5 కలర్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.
లోన్‌పై ఎలా తీసుకోవాలి.?
టాటా పంచ్ ప్యూర్ MT (బేస్ మోడల్) ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6,88,250 ఉంటుంది. మీరు ఈ కారును లోన్‌పై కొనాలంటే బ్యాంక్ నుంచి రూ. 6.2 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ సుమారు రూ. 68,000.
ఎంత ఈఎమ్ఐ చెల్లించాలి.?
ఉదాహరణకు మీకు కార్ లోన్ 9 శాతం వడ్డీకి లభించిందని అనుకుందాం. ఒకవేళ మీరు 7 ఏళ్ల కాల వ్యవధికి లోన్ తీసుకుంటే నెలకు రూ. 10 వేలు ఈఎమ్ఐ చెల్లించవచ్చు. ఆరు సంవత్సరాలకు అయితే రూ. 11,200, 5 సంవత్సరాలకు అయితే రూ. 12,900, 4 సంవత్సరాలకు సుమారు రూ. 16 వేల ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
ఈ కారులో 7 ఇంచెస్‌తో కూడిన సెమి-డిజిటల్ క్లస్టర్ స్క్రీన్‌ను అందించారు. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ (AC), క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, వర్షాన్ని గుర్తించి స్వయంగా పనిచేసే వైపర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు.
సేఫ్టీ పరంగా చూస్తే..
భద్రతా పరంగా చెప్పాలంటే ఈ కారు ముందు రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఇచ్చారు. అలాగే ABS, EBD సిస్టమ్‌ను ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. మైలేజ్ విషయానికొస్తే.. లీటర్‌కు 18 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కారులో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు.