- Home
- Sports
- Cricket
- India vs England: ఇంగ్లాండ్ లో 2007లో చరిత్ర సృష్టించిన ద్రావిడ్ సేన.. గిల్ జట్టు రిపీట్ చేస్తుందా?
India vs England: ఇంగ్లాండ్ లో 2007లో చరిత్ర సృష్టించిన ద్రావిడ్ సేన.. గిల్ జట్టు రిపీట్ చేస్తుందా?
India vs England: 2007లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పుడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా అదే విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఇంగ్లాండ్‌లో 2007 అద్బుత విజయాన్ని సాధించిన భారత జట్టు
యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 2007లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారత్ చివరిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన చారిత్రాత్మక క్షణాలను జట్టు గుర్తు చేసుకుంటోంది. ఆ సిరీస్ అప్పట్లో భారత క్రికెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో స్ఫూర్తిదాయకమైన విజయంగా నిలిచింది. ఆ తర్వాత టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించే బూస్ట్ లా మారింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ స్టాన్ ప్లేయర్లు లేకుండా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ ఆడటాని సిద్ధంగా ఉంది. గిల్ కెప్టెన్సీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడిన ప్లేయర్లు ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే, ద్రావిడ్ కెప్టెన్సీలోని అప్పటి విజయం గిల్ టీమ్ కు ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆ సిరీస్ వివరాలు గమనిస్తే..
ఇండియా vs ఇంగ్లాండ్ : లార్డ్స్‌లో మొదటి టెస్ట్ డ్రా
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆండ్రూ స్ట్రాస్ (96 పరుగులు), మైకేల్ వాన్ (79 పరుగులు) హాఫ్ సెంచరీలతో ఆరంభించడంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 218/1 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సూపర్ బౌలింగ్ దెబ్బకు 298 పరుగులకే కుప్పకూలింది. భారత పేస్ బౌలర్లు జహీర్ ఖాన్ (2/62), శ్రీశాంత్ (3/67), ఆర్పీ సింగ్ (2/58) ఆకట్టుకున్నారు.
భారత తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఆండర్సన్ (5/42), రియన్ సైడ్‌బాటమ్ (4/65) ధాటికి కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. వసీం జాఫర్ చేసిన 58 పరుగులే అత్యధిక పరుగులుగా ఉన్నాయి.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కెవిన్ పీటర్సన్ అద్భుతంగా ఆడి 134 పరుగులతో జట్టును 282 పరుగుల వద్ద నిలిపాడు. దీంతో భారత్ ముందు 380 పరుగుల భారీ లక్ష్యం వచ్చి చేరింది. అయితే కార్తిక్ (60 పరుగులు), వీవీఎస్ లక్ష్మణ్ (39 పరుగులు), ధోని (76 పరుగులు) మంచి ప్రదర్శనతో భారత్ 282/9 వద్ద నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
ఇండియా vs ఇంగ్లాండ్ : ట్రెంట్ బ్రిడ్జ్ రెండో టెస్ట్ లో భారత్ ఆధిపత్యం
నాటింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జహీర్ ఖాన్ (4/59), అనిల్ కుంబ్లే (3/32) సహకారంతో ఇంగ్లాండ్ 198 పరుగులకు ఆలౌటైంది.
భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు కార్తిక్ (77 పరుగులు), జాఫర్ (62 పరుగులు) శుభారంభానిచ్చారు. ద్రావిడ్ (37 పరుగులు), సచిన్ (91 పరుగులు), గంగూలీ (79 పరుగులు), లక్ష్మణ్ (54 పరుగులు) కలిసి స్కోరును 481 పరుగులకు చేర్చారు.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ (124 పరుగులు), స్ట్రాస్ (55 పరుగులు), కాలింగ్ వుడ్ (63 పరుగులు) రాణించడంతో 355 పరుగులు చేసింది. జహీర్ ఖాన్ (5/75), అనిల్ కుంబ్లే (3/104) బౌలింగ్‌లో రాణించారు. భారత్ 73 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా జహీర్ ఖాన్ నిలిచాడు.
ఇండియా vs ఇంగ్లాండ్ : ది ఓవల్‌లో మూడో టెస్ట్.. కుంబ్లే శతకం, భారత్ సిరీస్ విజయం
ఫైనల్ టెస్ట్ ది ఓవల్‌లో జరిగింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 664 పరుగుల భారీ స్కోర్ చేసింది. కార్తిక్ (91 పరుగులు), ద్రావిడ్ (55 పరుగులు), సచిన్ (82 పరుగులు), లక్ష్మణ్ (51 పరుగులు), ధోని (92 పరుగులు) అద్భుతంగా ఆడారు. అనిల్ కుంబ్లే 110 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఆండర్సన్ 4/182తో ఇంగ్లాండ్ బౌలింగ్‌లో టాప్ లో ఉన్నాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసింది. కుక్ (61 పరుగులు), కాలింగ్ వుడ్ (62 పరుగులు), ఇయాన్ బెల్ (63 పరుగులు) హాఫ్ సెంచరీలు చేసారు.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 11/3 పరుగులతో కష్టాల్లో పడినా సమయంలో గంగూలీ (57 పరుగుల) మెరుగైన ప్రదర్శనతో 180/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 500 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మంచి పోరాటం చేసింది. కుక్-స్ట్రాస్ 79 పరుగుల భాగస్వామ్యంతో ఆరంభించగా, పీటర్సన్ (101 పరుగులు), కాలింగ్ వుడ్ (40 పరుగులు), బెల్ (67 పరుగులు) మంచి నాక్ ఆడారు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కుంబ్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
#OnThisDay in 2007, Anil Kumble scored his only century in international cricket!
He hit a fabulous 110* in India's first-innings total of 664 against England at The Oval 🔥 pic.twitter.com/dEmkvaRCSU— ICC (@ICC) August 10, 2020
ఇండియా vs ఇంగ్లాండ్ : ఈ సిరీస్ లో ప్రధాన ప్రదర్శనలు
బ్యాట్స్‌మెన్:
• దినేష్ కార్తిక్: 263 పరుగులు (సగటు: 43.83, హయ్యెస్ట్ స్కోరు: 91 పరుగులు)
• సౌరవ్ గంగూలీ: 249 పరుగులు (సగటు: 49.80, హయ్యెస్ట్ స్కోరు: 79 పరుగులు)
• సచిన్ టెండూల్కర్: 228 పరుగులు (సగటు: 38.00, హయ్యెస్ట్ స్కోరు: 91 పరుగులు )
• ఎంఎస్ ధోనీ: 209 పరుగులు (సగటు: 52.25, హయ్యెస్ట్ స్కోరు: 92 పరుగులు)
బౌలర్లు:
• జహీర్ ఖాన్: 18 వికెట్లు (సగటు: 20.33, బెస్ట్: 5/75)
• అనిల్ కుంబ్లే: 14 వికెట్లు (సగటు: 34.50)
• ఆర్పీ సింగ్: 12 వికెట్లు
• శ్రీశాంత్: 9 వికెట్లు
రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో 2007లో ఈ చారిత్రాత్మక విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి గిల్ సేన కూడా ఆ విజయాన్ని ప్రేరణగా మార్చుకుని ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి విజయం సాధించాలనే ఆశతో ముందుకు సాగుతోంది.