- Home
- Business
- Business Ideas: తక్కువ శాలరీకే పని చేస్తున్నారా? అయితే ఈ 4 వ్యాపారాలు చేస్తే తిరుగే ఉండదు!
Business Ideas: తక్కువ శాలరీకే పని చేస్తున్నారా? అయితే ఈ 4 వ్యాపారాలు చేస్తే తిరుగే ఉండదు!
చాలామంది తక్కువ జీతానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. నెలంతా కష్టపడినా 20 వేల నుంచి 30 వేలు కూడా రాని పరిస్థితి. అయితే కొన్ని వ్యాపారాలతో ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఓసారి చూసేయండి.

బిజినెస్ ఐడియాస్
మనలో చాలామందికి ఉద్యోగం చేస్తేనే.. ఇళ్లు గడిచే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగం సంగతి పక్కన పెడితే… చాలామంది ప్రైవేటు ఉద్యోగాలపైనే ఆధారపడుతుంటారు. నెలంతా కష్టపడితే 20 వేల నుంచి 30 వేల రూపాయలు కూడా రాని పరిస్థితి. అందులోనూ ట్యాక్స్ లు కట్టింగ్ లు అని చాలానే ఉంటాయి.
నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బులు ఎంత ఫాస్ట్ గా అయిపోతాయో మనందరికీ తెలుసు. పైనుంచి ఇంకా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి. పైగా రోజుకు 8 నుంచి 10 గంటలు కష్టపడిన అదే జీతం. అదనపు ఆదాయం ఉండదు. మరి 20 వేల కోసం నెలంతా కష్టపడి పనిచేసేకంటే చిన్నదో, పెద్దదో వ్యాపారం మొదలు పెట్టడం మంచిది అంటున్నారు నిపుణులు.
మరి తక్కువ పెట్టుబడితో మంచి రాబడి వచ్చే కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి. వీటి ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చట. ప్రైవేటు ఉద్యోగంతో పోలిస్తే ఈ వ్యాపారాలు చాలా బెటర్ అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా మరి..
మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారా?
చాలామంది చాలా తక్కువ శాలరీకే పని చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా కష్టపడుతుంటారు. మీరు కూడా నెలకు 20 నుంచి 30 వేల జీతంతో ఉద్యోగం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ నాలుగు వ్యాపారాలు చేసి చూడండి. ఆరు నెలల్లోనే ఉద్యోగం గురించి మరిచిపోయి… మీరే ఇతరులకు ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.
1.టీ/తినుబండారాల అమ్మకం లేదా క్లౌడ్ కిచెన్
భారతదేశంలో టీ, ఫాస్ట్ ఫుడ్ సహా రకరకాల స్నాక్స్ (తినుబండారాలు)కు మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువ జనాలు ఉన్న ప్రదేశంలో చిన్న హోటల్ ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. 20 వేల రూపాయలతో కూడా ఈ వ్యాపారాలు ప్రారంభించవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా కూడా మీ ఆహారాన్ని విక్రయించవచ్చు. ప్రస్తుతం ఫుడ్ సంబంధిత వ్యాపారాలు చక్కగా నడుస్తున్నాయి. మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇంట్లో కూర్చొని.. ఆన్ లైన్లో ఆర్డర్లు తీసుకొని.. అవసరమైన ఫుడ్ ను తయారుచేసి పంపించవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే వాటిలో ఈ బిజినెస్ ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2. సీజనల్ వ్యాపారం
సంవత్సరం పొడవునా మంచి ఆదాయం పొందాలనుకుంటే.. కాలానికి అనుగుణంగా మీ అమ్మకాల శైలిని మార్చుకోవాలి. పండగల ఎక్కువగా ఉండే సమయంలో పూజా సామాగ్రి, రాఖీ పండగకు రాఖీలు, దీపావళికి దీపాలు, బాణసంచా, ఈద్ సమయంలో డ్రై ఫ్రూట్స్…ఇలా సందర్భాన్ని బట్టి వ్యాపారాలను ఎంచుకోవాలి.
వేసవికాలంలో కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీములకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించి రాబడిని బట్టి పెంచుకుంటూ పోవచ్చు.
ఒక్క వేసవికాలమే కాదు.. ఇలా చలికాలం, వర్షకాలంలోనూ కొన్నింటికి డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వ్యాపారంలో మార్పులు చేసుకుంటే పోతే నెలకు 50 నుంచి 60 వేల రూపాయలు సంపాదించవచ్చు.
3. హ్యాండ్ మేడ్ వస్తువులు
ప్రస్తుతం హ్యాండ్ మేడ్ వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. అవి కాస్త ఖరీదైనప్పటికీ చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. చేతితో తయారుచేసిన వస్తువులు అందంగా ఉండడంతోపాటు మన్నికగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం.
అదే విధంగా పాతకాలం నగలు, నాణేలు, నోట్లు సేకరించడం విక్రయించడం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. చేతితో తయారుచేసిన అలంకరణ వస్తువులు, నగలు, హ్యాండ్ బ్యాగులు, స్వెట్టర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. వాటి ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు.
4. స్టేషనరీ, మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకం
జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు లేదా పాఠశాలలు, కళాశాలల పరిధిలో స్టేషనరీ, మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మవచ్చు. విద్యార్థులకు అవసరమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను సులభంగా అమ్మవచ్చు. దీనితో పాటు జిరాక్స్ మిషన్ పెట్టుకుని కూడా డబ్బు సంపాదించవచ్చు.
గమనిక:
ఇది ఇంటర్నెట్, నిపుణుల అభిప్రాయం మేరకు ఇచ్చిన సమాచారం మాత్రమే. దీన్ని సమాచారంగా మాత్రమే తీసుకోవాలి.