Voter ID Card కోసం ఎదురుచూపులకు చెక్... ఇలా అప్లై చేసి అలా పొందండి
మీకు ఓటర్ ఐడీ కార్డు కావాలా..? ఇలాచేసారో కేవలం 15 రోజుల్లోనే కార్డు మీ చేతిలో ఉంటుంది. కొత్త కార్డును పొందడం కూడా ఇక చాలా ఈజీ.

15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డు మీ చేతికి...
Voter ID Card : ఎన్నికల సమయంలోనే కాదు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం కూడా మనందరం ఓటర్ ఐడీ కార్డును వాడుతుంటాం. ఈ ఓటర్ ఐడీ కార్డును ఎలక్షన్ కమీషన్ జారీ చేస్తుంది. అయితే ఈ ఓటర్ కార్డు ఎక్కడైనా మిస్ అయితే కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. అలాగే కొత్తగా ఓటుహక్కు పొందినవారికి కూడా ఈసీ కొత్త కార్డును అందిస్తుంది. అయితే తాజాగా ఈ ఓటర్ ఐడీ కార్డు జారీ విషయంలో ఈసిఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై కొత్తగా ఓటుహక్కు పొందినవారు లేదా ఓటర్ ఐడీ కార్డు మిస్సయి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు లేదా ఓటర్ ఐడీ కార్డులో మార్పులు చేసుకున్నవారు కొత్త కార్డు కోసం ఎదురుచూపులు లేకుండా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది ఈసిఐ. ఇంతకాలం ఓటర్ ఐడీ కార్డు జారీకి నెలరోజుల సమయం తీసుకునేవారు... కానీ ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే కార్డు దరఖాస్తుదారుడి చేతికి చేరేలా ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకుంది.
మీ ఓటర్ ఐడీ స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు
ఓటర్ ఐడీ కార్డు దరఖాస్తు తర్వాత డెలివరీ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా అందించనున్నట్లు ఈసిఐ తెలిపింది. ఇందుకోసం రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ఈ కొత్త ఓటర్ ఐడీ కార్డు జారీ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను ప్రవేశపెట్టినట్లు ఈసిఐ తెలిపింది.
ఓటర్లకు అనుకూలంగా ఈసిఐ కీలక నిర్ణయం
ఓటర్ లిస్టులో పేరు నమోదు కోసం కేటాయించిన అధికారుల ద్వారా లేదంటే ఆన్ లైన్ లో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ముందుగా EPIC నంబర్ జనరేట్ అవుతుంది. అప్పటినుండి కార్డు ప్రింట్ అయి పోస్ట్ ద్వారా దరఖాస్తుదారుడికి చేరేవరకు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కేవలం 15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డు అందించేందుకు సరికొత్త విధానాన్ని ఈసిఐ ప్రవేశపెట్టింది.
ఆన్ లైన్ లో ఓటుహక్కును ఎలా నమోదుచేసుకోవాలి?
భారతీయ పౌరులకు 18 ఏళ్లు నిండాయంటే ఓటుహక్కును పొందవచ్చు. ఇందుకోసం ఆఫ్ లైన్ లో అంటే రెవెన్యూ లేదా మున్సిపల్ కార్యాలయాలను నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటూ ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈసిఐ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు ప్రక్రియ
https://www.eci.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే 'Electors' అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. వెంటనే 'Resister in Electoral Roll' అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే 'New Registration for general Electors' కనిపిస్తుంది. ఇందులో 'fill form 6' పై క్లిక్ చేసి కొత్తగా ఓటుహక్కును నమోదు చేసుకోవచ్చు. ఎన్నారైలు అయితే దరఖాస్తు ఫార్మ్ 6A పూర్తిచేయాలి.