MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • UGC NET: యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

UGC NET: యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

UGC NET 2025: యూజీసీ నెట్ 2025 జూన్ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ విడుదల అయింది.  జూన్ 25 నుంచి 29 వరకు సీబీటీ మోడ్ లో పరీక్షలు జరగనున్నాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 19 2025, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ అప్డేట్
Image Credit : Getty

యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ అప్డేట్

UGC NET 2025: జూన్ 25న జరగనున్న యూజీసీ నెట్ 2025 జూన్ సెషన్ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లో ఈ స్లిప్ లు అందుబాటులో ఉన్నాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ అభ్యర్థులకు పరీక్ష కేంద్ర నగరం వివరాలు ముందుగా తెలియజేసి, వారి ప్రయాణం, వసతి ఏర్పాట్లకు సహకరిస్తుంది.

పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఉపయోగించి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు జూన్ 25 నుండి 29 తేదీల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో రెండు షిఫ్టుల్లో జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది.

26
UGC NET 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Image Credit : Getty

UGC NET 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in కు వెళ్లండి

2. హోమ్‌పేజ్ లోని "UGC NET Exam City Intimation Slip" లింక్‌పై క్లిక్ చేయండి

3. ఓ కొత్త లాగిన్ విండో ఓపెన్ అవుతుంది

4. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి

5. నగర సమాచారం స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

6. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి

డైరెక్టు లింక్: UGC NET 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌

Related Articles

Related image1
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ డీట్‌ ద్వారా 10,080 ఉద్యోగాలు
Related image2
Jobs: పది పాస్ అయితే చాలు, రూ.50వేలకుపైగా జీతంతో ప్రభుత్వ ఉద్యోగం
36
UGC NET 2025: యూజీసీ నెట్ 2025 పరీక్షల వివరాలు
Image Credit : FREEPIK

UGC NET 2025: యూజీసీ నెట్ 2025 పరీక్షల వివరాలు

యూజీసీ నెట్ 2025 జూన్ సెషన్ పరీక్షలు జూన్ 21 నుండి 30 మధ్య నిర్వహించనున్నట్టు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే, తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి 29 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. 

పూర్తి సబ్జెక్ట్ వారీ షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లో అందుబాటులో ఉంది.

46
UGC NET 2025: సిటీ ఇంటిమేషన్ స్లిప్‌, అడ్మిట్ కార్డు ప్రాముఖ్యత
Image Credit : Getty

UGC NET 2025: సిటీ ఇంటిమేషన్ స్లిప్‌, అడ్మిట్ కార్డు ప్రాముఖ్యత

సిటీ ఇంటిమేషన్ స్లిప్‌తో అభ్యర్థులకు పరీక్ష కేంద్రం నగర వివరాలు ముందుగా అందుతాయి. ఇది ప్రయాణం, వసతి మొదలైన ఏర్పాట్ల కోసం కీలకం. ఈ స్లిప్ ఆలస్యంగా విడుదల కావడం వల్ల అభ్యర్థులకు కొన్ని సందేహాలు, అసౌకర్యాలు ఏర్పడినట్లు సమాచారం.

స్లిప్ విడుదలైన తర్వాత త్వరలోనే అడ్మిట్ కార్డు (hall ticket) విడుదల కానుంది. ఇందులో పూర్తి పరీక్ష కేంద్రం చిరునామా, తేదీ, టైమింగ్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉండదనే విషయం గుర్తుంచుకోండి.

56
యూజీసీ నెట్ 2025 అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Image Credit : iSTOCK

యూజీసీ నెట్ 2025 అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

1. ugcnet.nta.ac.in కు లాగిన్ అవ్వాలి

2. "UGC NET Admit Card" లింక్ పై క్లిక్ చేయాలి

3. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి

4. అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది

5. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి

66
యూజీసీ నెట్ 2025 అర్హత మార్కులు (Qualifying Marks)
Image Credit : Getty

యూజీసీ నెట్ 2025 అర్హత మార్కులు (Qualifying Marks)

• జనరల్ వర్గానికి: మొత్తం మార్కులలో 40% రావాలి.

• రిజర్వ్డ్ వర్గాలకి: మొత్తం మార్కులలో 35% రావాలి.

జేఆర్ఎఫ్ అర్హతకు సాధారణంగా కట్-ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పరీక్ష క్లిష్టత స్థాయిని బట్టి కట్-ఆఫ్ మారవచ్చు.

UGC NET జూన్ 2025 పరీక్ష వివరాలు

UGC NET (University Grants Commission – National Eligibility Test) ప్రతి సంవత్సరం రెండు సార్లు NTA (National Testing Agency) నిర్వహిస్తుంది. ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, పీహెచ్.డి ప్రవేశాలకు అర్హతను పరీక్షిస్తుంది.

• పరీక్ష నగర సమాచారం (City Intimation Slip) విడుదల అయింది. అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల కానుంది.

• అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ను తరచూ తనిఖీ చేయడం ముఖ్యం, ఎందుకంటే ఏవైనా తాజా అప్డేట్స్, మార్పులు అక్కడే వెల్లడిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved