MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Covid 19: ఉన్న‌ట్లుండి క‌రోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.? న‌ర‌కాన్ని త‌ల‌పిస్తోన్న‌ కొత్త ల‌క్షణాలు

Covid 19: ఉన్న‌ట్లుండి క‌రోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.? న‌ర‌కాన్ని త‌ల‌పిస్తోన్న‌ కొత్త ల‌క్షణాలు

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ త‌న పంజా విసిరేందుకు సిద్ధ‌మ‌వుతోందా అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. తాజాగా పెరుగుతోన్న కేసులే దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 19 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశంలో మ‌ళ్లీ పెరుగుతోన్న క‌రోనా కేసులు
Image Credit : stockPhoto

దేశంలో మ‌ళ్లీ పెరుగుతోన్న క‌రోనా కేసులు

ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ తిరిగి విజృంభిస్తోంది. కొత్త కేసుల పెరుగుదల పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ, వైద్య నిపుణులు అప్రమత్తమయ్యారు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, కరోనా పెరుగుదలకు ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు కొత్త ఉపరకాలు (Subvariants) కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా NIV గుర్తించిన వేరియంట్లు ఇవే:LF.7, XFG, JN.1.16, NB.1.8.1. ప్రాథమికంగా JN.1.16 వలన కేసులు పెరిగినా, మే నెల నుంచి XFG ప్రభావం అధికంగా కనిపిస్తోంది. LF.7, LP.81.2 అనే రెండు ఉపరకాలు కలిసి XFGగా రూపాంతరం చెందినట్టు నిపుణులు వెల్లడించారు. వైరస్‌లో జరిగే నిరంతర మార్పులు దీనికి కారణని అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కేసులు ఎలా ఉన్నాయి.?
Image Credit : Asianet News

కేసులు ఎలా ఉన్నాయి.?

కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్ర‌స్తుతం మొత్తం 6483 యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 113 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కేరళ, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీలో కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. అయితే ఈసారి ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉంది. రోగులు చాలా మంది హాస్పిటల్ అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

36
అమెరికాలో నింబస్ వేరియంట్ కలకలం
Image Credit : META AI

అమెరికాలో నింబస్ వేరియంట్ కలకలం

ఇండియాలో కొత్త వేరియంట్లు కలవరం రేపుతున్న నేపథ్యంలో, అమెరికాలో నింబస్ (Nimbus) అనే వేరియంట్ పెద్ద కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌కు శాస్త్రీయ నామం NB.1.8.1. ఇది గతేడాదే మొదట చైనాలో వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు అమెరికాలో కేసుల్లో 37 శాతం ఈ వేరియంట్ కారణంగా నమోదవుతున్నాయి. దీని వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది.

46
నింబస్ లక్షణాల్లో ‘రేజర్ బ్లేడ్ థ్రోట్’
Image Credit : social media

నింబస్ లక్షణాల్లో ‘రేజర్ బ్లేడ్ థ్రోట్’

నింబస్ వేరియంట్ ప్రధాన లక్షణంగా ‘రేజర్ బ్లేడ్ థ్రోట్’ కనిపిస్తోంది. అంటే గొంతు కోసుకుపోయినట్టుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. ఇది చాలా మంది బాధితులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అమెరికాతో పాటు యూకే, ఇండియాలో కూడా ఇటువంటి లక్షణాలు ఉన్న కేసులు గుర్తించారు. మింగుతున్న స‌మ‌యంలో గొంతు బ్లేడ్‌తో కోసుకుపోయిన భావ‌న క‌లుగుతుంది.

వీటితో పాటు పొడి దగ్గు, అధిక జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు, మతి మరుపు, నిద్రమత్తు, కండరాల నొప్పులు, డయేరియా వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు గుర్తించారు.

56
వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా?
Image Credit : social media

వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతానికి ఇది తీవ్రమైన ప్రమాదంగా లేకపోయినా, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో ఈ వేరియంట్‌ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ, ఈ వేరియంట్ యాంటీబాడీస్‌ను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటమే ఆందోళన కలిగిస్తోంది.

66
నిరంతర మార్పులే కొత్త వేరియంట్లకు కారణం
Image Credit : Google

నిరంతర మార్పులే కొత్త వేరియంట్లకు కారణం

నిపుణుల అంచనా ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ అనేక మ్యూటేషన్లకు లోనవుతూ నింబ‌స్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఈ మార్పుల వల్లే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే యాంటీబాడీస్ ఉన్నవారికి కూడా ఇది సోకుతోంది.

అయితే ప్రస్తుతం కేసుల తీవ్రత తక్కువగానే ఉన్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లడాన్ని తగ్గించడం వల్ల రక్షణ పొందవచ్చు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, అనుమానాస్పద లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
కరోనా వైరస్
భారత దేశం
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Smart watch: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? స్మార్ట్‌వాచ్‌తో డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు.. ట్యాప్ చేస్తే చాలు.
Recommended image2
Donald Trump పాకిస్థాన్ అంటే ట్రంప్‌కి ఎందుకంత ప్రేమ.? పాక్‌కు స‌పోర్ట్ అందుకే చేస్తున్నారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved