తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:53 PM (IST) Jun 03
RCB wins IPL 2025 Kohli finally gets his first IPL trophy: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆనందంలో విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
11:24 PM (IST) Jun 03
IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది.
11:10 PM (IST) Jun 03
వెయిట్ తగ్గించుకోవాలనుకునేవాళ్ళు చాలా రకాల డైట్స్ ట్రై చేస్తారు. కాని ఏది కరెక్ట్ పద్ధతో చాలామందికి తెలీదు. రోజుకి ఎన్ని సార్లు తింటే వెయిట్ త్వరగా తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
10:21 PM (IST) Jun 03
190 పరుగుల్ని ఆర్‌సిబి కాపాడుకుంటుందా? పంజాబ్ ఈ స్కోర్‌ని ఛేజ్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి అభిమానులకు ఓ గణాంకం ఊరటనిస్తోంది. అదేంటంటే…
10:20 PM (IST) Jun 03
టయోటా అంటేనే క్లాసిక్ డిజైన్ కార్లకు ఫేమస్. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి నియో డ్రైవ్ లుక్ తో రెండు కొత్త మోడల్స్ విడుదల అయ్యాయి. ఫార్చూనర్, లెజెండర్ పేరుతో వీటిని లాంచ్ చేశారు. వీటి ఫీచర్స్ తెలుసుకుందామా?
09:38 PM (IST) Jun 03
రైతులకు వ్యాధి లేని మొక్కలు అందించడానికి 'క్లీన్ ప్లాంట్' ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ₹300 కోట్లతో దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించాచారు.
09:30 PM (IST) Jun 03
ఒకప్పుడు స్ట్రాంగ్, లాంగ్ కార్లకు బ్రాండ్ గా నిలిచిన టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయ్. ఈ సారి న్యూ లుక్, సూపర్ ఫీచర్లతో అడుగు పెట్టనున్నాయ్. కారు ప్రియులకు ఇష్టమైన ఈ కార్ల గురించి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?
09:18 PM (IST) Jun 03
Virat Kohli: ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. శిఖర్ ధావన్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
08:52 PM (IST) Jun 03
ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ఫోన్ కాల్‌తో మోదీ లొంగిపోయారని ఆరోపించారు
07:27 PM (IST) Jun 03
IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి.
07:08 PM (IST) Jun 03
తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం తీసుకువచ్చిన ఈ ధరణి, భూభారతి మధ్య పోలిక, తేడాలేమిటో ఇక్కడ చూద్దాం.
06:54 PM (IST) Jun 03
ప్రపంచంలో కొన్ని దేశాలు మహిళలకు చాలా సురక్షితమైనవి. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
06:19 PM (IST) Jun 03
IPL 2025 Final RCB vs PBKS:ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఆర్సీబీ vs పీబీకేఎస్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయింగ్ 11లో ఎవరెవరుంటారు? పూర్తి జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
06:09 PM (IST) Jun 03
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఈ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
05:48 PM (IST) Jun 03
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే సింపుల్ గా మొదలుపెట్టి, దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. పండగల సమయంలో డిమాండ్ ఫుల్ గా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటో? ఎలా స్టార్ట్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
05:48 PM (IST) Jun 03
Heinrich Klaasen net worth IPL salary: స్టార్ క్రికెటర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ సంపాదన, ఐపీఎల్ జీతం, బ్రాండ్ డీల్స్ సహా అతనికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:33 PM (IST) Jun 03
ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన రెస్టారెంట్ కల్చర్ ప్రస్తుతం చిన్న నగరాలకు సైతం విస్తరించింది. అయితే రెస్టారెంట్స్‌కి వెళ్లిన వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మంచి నీరు ఒకటి.
04:52 PM (IST) Jun 03
వేసవిలో AC చల్లదనం ఇస్తుంది కానీ విపరీతమైన వినియోగంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్, తలనొప్పి, చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ చిట్కా ఉంది. అదేంటంటే..
04:30 PM (IST) Jun 03
Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2018లో అరంగేట్రం చేసిన క్లాసెన్.. 3000లకు పైగా పరుగులతో కెరీర్ ముగించారు.
04:19 PM (IST) Jun 03
వాట్సాప్‌లో ప్రైవసీ లేదని ఫీలవుతున్నారా? మీ ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే వాట్సాప్ మెసేజ్ లు చూసేస్తారని భయపడుతున్నారా? కంగారు పడకండి. ఫేస్ బుక్, ఇన్ స్టాలో మాదిరి వాట్సాప్ లో కూడా లాగ్ అవుట్ ఆప్షన్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో..
04:06 PM (IST) Jun 03
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలోనే రాష్ట్రంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. విశాఖపట్నం, విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మెట్రో ప్రాజెక్టులు తొలి దశలోకి ప్రవేశించాయి. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి అధికారిక ఆమోదం లభించింది.
03:50 PM (IST) Jun 03
IPL 2025 Orange and Purple Cap: ఐపీఎల్ 2025లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలకు బంపర్ జాక్‌పాట్ ఉంటుంది. ఈ రేసులో సాయి సుదర్శన్, ప్రసిద్ధ్ కృష్ణలు టాప్ లో ఉన్నారు. వీరు ఎంత ఫ్రైజ్ మనీ అందుకుంటారో తెలుసా?
02:52 PM (IST) Jun 03
Tata Harrier EV: కేరళలోని ఎలిఫెంట్ రాక్‌ను హారియర్.ev అధిరోహించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. 360-డిగ్రీ కెమెరా, ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, టెర్రైన్-స్పెసిఫిక్ డ్రైవింగ్ మోడ్‌ల వంటి ఫీచర్లను ఈ వీడియో హైలైట్ చేస్తుంది.
02:38 PM (IST) Jun 03
IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ 2025 ఫైనల్‌ను గెలవడానికి విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
01:59 PM (IST) Jun 03
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. మరి వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించినా, పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చినా విజేతలను ఎలా నిర్ణయాస్తారు.
01:45 PM (IST) Jun 03
RCB vs PBKS IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సబీ vs పీబీకేఎస్ జట్లు తలపడనున్నాయి. అయితే, బెంగళూరు vs పంజాబ్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారితే ఏం జరుగుతుంది? ట్రోఫీని అందుకునేది ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
01:04 PM (IST) Jun 03
Students romance in bus: స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకుంటేనే దానికి అర్థం ఉంటుంది. పక్కవారికి ఇబ్బంది కలిగించేలా ఉంటే దానిని సమాజం అంగీకరించదు. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
12:16 PM (IST) Jun 03
తెలుగు రాష్ట్రాల్లో ఈవారం కూడా లాంగ్ వీకెండ్ రానుందా? బక్రీద్ పండక్కి రెండ్రోజులు కాదు మూడ్రోజులు సెలవులు వస్తాయా? తెలుగు ప్రజలు మరీముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెబుతాయా?
11:41 AM (IST) Jun 03
యూట్యూబ్‌లో సెర్చ్ చేయడంలో చేసిన చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కనిపించిన ముత్యాల సాగు వీడియో ఆయన జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే రూ.లక్షల్లో అప్పులు తీర్చేసి రూ.లక్షలు సేవ్ చేసేంతగా.. ఆ వ్యక్తి ఎవరు? ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా?
11:38 AM (IST) Jun 03
RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి కోసం ట్రోఫీ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
11:24 AM (IST) Jun 03
స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు బలమైన ఆర్థిక వ్యవస్థగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు.
09:57 AM (IST) Jun 03
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలంలో వానలు దంచికొట్టగా… ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఇలా కాలంతో సంబంధం లేకుండా వాతావరరణ పరిస్థితులు మారుతున్నాయి.
08:29 AM (IST) Jun 03
పాపం… కవలలుగా కలిసిపుట్టిన చిన్నారులను రోడ్డు ప్రమాదం దూరం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి తల్లిదండ్రులు, కవల సోదరిని కోల్పోయి తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యింది.