Tata Harrier EV: కేరళలోని ఎలిఫెంట్ రాక్‌ను హారియర్.ev అధిరోహించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. 360-డిగ్రీ కెమెరా, ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, టెర్రైన్-స్పెసిఫిక్ డ్రైవింగ్ మోడ్‌ల వంటి ఫీచర్లను ఈ వీడియో హైలైట్ చేస్తుంది.

హారియర్.evను విడుదల చేయడానికి టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ సామర్థ్యాలను ప్రదర్శించే వీడియోను కంపెనీ విడుదల చేసింది. కేరళలోని టీ తోటల మధ్య ఉన్న ప్రసిద్ధ ఎలిఫెంట్ రాక్‌ను హారియర్.ev ఎలా అధిరోహించిందన్న వివరాలను ఈ వీడియోలో చూపించారు. 3937 అడుగుల ఎత్తున్న ఎలిఫెంట్ రాక్ ను ఈ కారు మూడు అధిరోహించింది. 

YouTube video player

360-డిగ్రీ కెమెరా, ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, రాక్ క్రాల్, స్నో, ఇసుక వంటి మూడు టెర్రైన్ మోడ్‌లతో కూడిన రోటరీ డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్ వంటి ఫీచర్లను వీడియోలో చూపించారు. అదనంగా ఈ కారులో Eco, Boost మోడ్‌లు కూడా ఉన్నాయి. ఏటవాలుగా ఉన్న కొండపై బూస్ట్ మోడ్ లో కారు వెళ్లడం చూస్తుంటే ఆశ్చర్యం కలగాల్సిందే.

ఆఫ్-రోడ్ అసిస్ట్ మోడ్, ట్రాన్స్‌పరెంట్ బోనెట్ వ్యూ వంటి ఫీచర్లను వీడియోలు చూపించారు. 

డ్యూయల్-మోటార్ క్వాడ్-వీల్-డ్రైవ్ (QWD) సిస్టమ్, అనేక హై-ఎండ్ ఫీచర్లతో, మహీంద్రా XUV.e9 వంటి SUVలకు ఇది గట్టి పోటీనిస్తుంది.

హారియర్ EV, ICE వెర్షన్ లాంటి హెడ్‌లైట్లు, DRLలతో దూకుడుగా, బలంగా కనిపిస్తుంది. కొత్త గ్రిల్, బంపర్ దీనికి ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. LED DRL స్ట్రిప్, అల్లాయ్ వీల్స్ దీనికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

ఈ కారుకు సంబంధించి ఇప్పటి వరకు ధర, ఫీచర్ల గురించి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే కంపెనీ విడుదల చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.