Cyber crime: సన్నీలియోన్‌నే వదిలిపెట్టలేదు.. మనమెంత చెప్పండి. అందుకే..
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఈ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్నీ లియోన్ పేరుతో మోసం
ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి సన్నీ లియోన్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచి, ప్రభుత్వ పథకం ద్వారా వస్తున్న డబ్బును అక్రమంగా తీసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. గతేడాది జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మహతారి వందన్ యోజన డబ్బును కాజేశారు
మహతారి వందన్ యోజన అనే పథకం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం వివాహిత మహిళలకు నెలకు రూ. 1,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఈ పథకంలో ఒక అకౌంట్ పేరు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో నమోదై ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆ ఖాతాకు కూడా నగదు జమకావడంతో కంగుతున్న అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
మన పేరు మీదు కూడా ఉండొచ్చు.?
అయితే సన్నీలియోన్ వంటి స్టార్ సెలబ్రిటీలు సైబర్ నేరస్థుల బారినపడితే సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.? నకిలీ ఐడీ ప్రూఫ్‌లు, ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తూ రుణాలు తీసుకోవడం లాంటివి ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి మన పేరుపై ఏమైనా లోన్స్ ఉన్నాయా.? మన ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు ఉన్నాయా.? లాంటి వివరాలను ఇట్టే తెలుసుకోవచ్చు. అదేలాగంటే.
మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా తెలుసుకోండి.
ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. దీంతో మనకు తెలియకుండానే చాలా చోట్ల ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇస్తుంటాం. దీనిని ఆసరగా చేసుకొని కొందరు సైబర్ నేరస్థులు మన ఆధార్ కార్డుతో లోన్‌లు వంటివి తీసుకుంటున్నారు.
అయితే మన ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకునేందుకు ఒక అవకాశం ఉంది. ఇందుకోసం myaadhaar.uidai.gov.in/login అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Step 1: "My Aadhaar" సెక్షన్‌లోకి వెళ్లండి.
Step 2: "Aadhaar Services" కింద ‘Aadhaar Authentication History’ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. వెంటనే ఓటీపీ వస్తుంది.
Step 4: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన OTPను ఎంటర్ చేయండి.
Step 5: డేట్ రేంజ్ ఎంచుకొని, Authentication Type (All లేదా Specific Type) ఎంచుకుని, Submit చేయండి.
మీ ఆధార్ ఎప్పుడు ఉపయోగించారో, ఏ సంస్థ ద్వారా వాడారో, Success/Failure స్టేటస్ ఏంటి.? Response Code వంటి వివరాలన్నీ చూడవచ్చు.