Bakrid Holidays : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బక్రీద్ సెలవులు మూడ్రోజులా?
తెలుగు రాష్ట్రాల్లో ఈవారం కూడా లాంగ్ వీకెండ్ రానుందా? బక్రీద్ పండక్కి రెండ్రోజులు కాదు మూడ్రోజులు సెలవులు వస్తాయా? తెలుగు ప్రజలు మరీముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెబుతాయా?

బక్రీద్ పండగను ముస్లింలు ఎలా జరుపుకుంటారు?
Bakrid Holidays : బక్రీద్... ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగ. ఈ రోజు మేకలను బలిచ్చి దగ్గరి బంధువులు, స్నేహితులకు మాంసం పంచిపెడుతుంటారు ముస్లింలు... దీన్ని ఖుర్బానీ అంటారు. అలాగే కొత్తబట్టలు ధరించి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు... రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు, స్వీట్స్ రుచిచూస్తారు. ఇలా బక్రీద్ పండగను ముస్లింలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కాబట్టి భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు సెలవు ఇస్తారు.
జూన్ 7న బక్రీద్ సెలవు
అయితే ఈసారి బక్రీద్ ఈ నెల(జూన్) లోనే ఉంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు జూన్ 7 బక్రీద్ సెలవుగా ప్రకటించాయి. అయితే ముస్లిందేశాల్లో మరీముఖ్యంగా మక్కా కొలువైన సౌది అరేబియాలో జూన్ 6నే బక్రీద్ జరుపుకోనున్నారు. ఈమేరకు ఇప్పటికే సౌదీ మతపెద్దలు ప్రకటించారు. ఇండియాలో కూడా జూన్ 6 సాయంత్రం నుండి బక్రీద్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. ఈ నేపథ్యంలో జూన్ 6న కూడా సెలవు ఇస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
బక్రీద్ సెలవు రెండ్రోజులా? మూడ్రోజులా?
బక్రీద్ పండగ నేపథ్యంలో వచ్చే శనివారం(జూన్ 7) న సెలవు ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. కాబట్టి బక్రీద్ కు ఆదివారం కలిసిరావడంతో వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి. అయితే ఇవి మూడ్రోజుల సెలవులుగా మారే అవకాశాలున్నాయా? ఇదే జరిగితే ఈ వీక్ లాంగ్ వీకెండ్ గా మారుతుంది.
భారతదేశంలో ముస్లింలు మతపరమమైన అంశాల్లో పవిత్రమైన మక్కా కొలువైన సౌదీ అరేబియాను ఫాలో అవుతుంటారు. కాబట్టి అక్కడ శుక్రవారమే బక్రీద్ జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ముస్లింలు శుక్రవారంను ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు... కాబట్టి ఆరోజే భారత్ లో కూడా బక్రీద్ ప్రార్థనలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ముస్లిం సమాజం నుండి డిమాండ్స్ వస్తే శుక్రవారం కూడా సెలవు ఇచ్చే అవకాశాలుంటాయి. ఇదే జరిగితే వరుసగా శుక్ర, శని, ఆదివారాలు (జూన్ 6,7,8 తేధీల్లో) వరుస సెలవులు వస్తాయి.
హైదరాబాద్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు
తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో ముస్లింల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. పాతబస్తీ ప్రాంతంలో ముస్లిం పండగలను చాలా ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ పండక్కి కూడా తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల సెలవులు ఇచ్చింది. ఇప్పుడు బక్రీద్ కు కూడా అలాగే రెండ్రోజుల సెలవులు ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. ముస్లింల అభ్యర్థనను మన్నించి శుక్రవారం కూడా సెలవు ఇస్తే మూడ్రోజులు వరుస సెలవులు వస్తాయి.
అందరికి సెలవు ఇవ్వకున్నా ముస్లిం ఉద్యోగులకు జూన్ 6న ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. ఇక జూన్ 7న అంటే శనివారం ఎలాగూ సెలవు ప్రకటించారు... ఆ తర్వాత ఆదివారం సెలవే. కాబట్టి మూడ్రోజులు కాకున్నా రెండ్రోజుల సెలవులయితే ఖాయం.
శనివారం బక్రీద్ .. హైదరాబాద్ లో భారీ బందోబస్తు :
సాధారణంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తో పాటు ఇతర మతాల పండగలు, ప్రత్యేక వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. హైదరాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది బక్రీద్ పండగ శనివారం వస్తోంది... అంటే ఆరోజు హిందువులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఈసారి బక్రిద్ కు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు... బక్రీద్ పండక్కి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో బక్రీద్ పండగవేళ జంతుబలులు విషయంలో ఉద్రిక్తతలు చెలరేగిన ఘటనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ముస్లిం, హిందు మతపెద్దలతో చర్చించి శాంతియుత వాతావరణంలో పండగ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు.