Heinrich Klaasen net worth IPL salary: స్టార్ క్రికెటర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ సంపాదన, ఐపీఎల్ జీతం, బ్రాండ్ డీల్స్ సహా అతనికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Heinrich Klaasen net worth IPL salary revealed: దక్షిణాఫ్రికా క్రికెట్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన 33 ఏళ్ల క్లాసెన్, ఇప్పుడు వన్డేలు, టీ20ల నుంచి కూడా తప్పుకోవడం అభిమానులకు షాక్‌ను కలిగించింది. అయితే, గ్లోబల్ టీ20 లీగ్‌లలో మాత్రం క్లాసెన్ కొనసాగనున్నాడు.

క్లాసెన్ చివరిసారి దక్షిణాఫ్రికా జెర్సీ ధరించిన మ్యాచ్ ను న్యూజిలాండ్‌పై దుబాయ్‌లో ఆడాడు. అది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్. అలాగే, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టుతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా తరఫున ఆడాడు. ఇక్కడ క్లాసెన్ మంచి నాక్ ఆడాడు కానీ, భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.

హెన్రిచ్ క్లాసెన్ సంపాదన ఎంత?

పలు మీడియా నివేదికల ప్రకారం.. 2024 నాటికి క్లాసెన్ నికర ఆస్తి సుమారు USD 6 మిలియన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.51 కోట్లు. 2025లో క్లాసెన్ నికర ఆస్తిపై ఇంకా అప్‌డేట్ అందుబాటులో లేదు. అతని ఆదాయంలో ప్రధాన భాగం ఐపీఎల్ జీతం, క్రికెట్ సౌతాఫ్రికా కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల నుంచే వస్తోంది.

హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ జర్నీ

2018లో రాజస్తాన్ రాయల్స్ ద్వారా క్లాసెన్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అతని ప్రారంభ జీతం రూ.50 లక్షలు. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్లాసెన్ ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మూడు సీజన్లు విరామం తర్వాత 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 మెగా వేలానికి ముందు క్లాసెన్‌ను రూ.23 కోట్లు ఇచ్చి సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది.

క్లాసెన్ ఆడుతున్నఇతర క్రికెట్ లీగ్‌లు

క్లాసెన్ ఇంగ్లాండ్ ‘ది హండ్రెడ్’, కరీబియన్ ప్రీమియర్ లీగ్, అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్, కెనడాలో గ్లోబల్ టీ20, SA20 లీగ్‌లలో కూడా ఆడుతున్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు

హెన్రిచ్ క్లాసెన్ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల నుంచి కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. క్లాసెన్ ఎండోర్స్ చేసిన బ్రాండ్లలో సరీన్ స్పోర్ట్స్, కేఎఫ్సీ, ఎల్జీ, న్యూవారా, నీయో లైఫ్ సౌతాఫ్రికా, ఎంఆర్ఎఫ్ టైర్స్, అసిక్స్ సహా పలు ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి.

హెన్రిచ్ క్లాసెన్ కారు కలెక్షన్ ఇదే

హెన్రిచ్ క్లాసెన్ వద్ద Mercedes-Benz GLC Coupe, BMW X5 సహా డజన్ల కార్లు ఉన్నాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.