WhatsApp: వాట్సాప్‌లో లాగ్ అవుట్ ఫీచర్: ఇక మీ సీక్రెట్ మెసేజ్‌లు ఎవరికీ కనిపించవు
వాట్సాప్‌లో ప్రైవసీ లేదని ఫీలవుతున్నారా? మీ ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే వాట్సాప్ మెసేజ్ లు చూసేస్తారని భయపడుతున్నారా? కంగారు పడకండి. ఫేస్ బుక్, ఇన్ స్టాలో మాదిరి వాట్సాప్ లో కూడా లాగ్ అవుట్ ఆప్షన్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో..
- FB
- TW
- Linkdin
Follow Us
)
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
ప్రస్తుతం 98 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారు. పర్సనల్ ఫోటోలు, వీడియోలు వాట్సాప్ లోనే పంపించుకుంటున్నారు. ఇది అప్ డేట్ అయిన తర్వాత ఆఫీస్ పనులు కూడా వాట్సాప్ ద్వారా చేసేవారు ఎక్కువగానే ఉన్నారు. అందుకే యూజర్లకు మరింత అనువుగా ఉండేలా వాట్సాప్ మాతృ సంస్థ మెటా తరచూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్‌కి సంబంధించి “లాగ్ అవుట్” అనే ఒక కొత్త ఫీచర్ తీసుకువస్తుందన్న వార్త వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ లో లాగ్ అవుట్ ఉంది
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో యూజర్లు అవసరమైతే లాగ్ అవుట్ అయిపోవచ్చు. కానీ ఇప్పటి వరకు వాట్సాప్‌లో అలాంటి అవకాశం లేదు. మెసేజ్ లు వస్తున్నాయన్న నోటిఫికేషన్స్ మీకు చికాకుగా ఉంటే తాత్కాలికంగా మొబైల్ డేటా లేదా వైఫైను ఆఫ్ చేయాలి. లేదా పర్మనెంట్ గా నోటిఫికేషన్స్ ఆఫ్ లో పెట్టుకోవాలి. కాని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో లాగ్ అవుట్ అయిపోవచ్చు. అప్పుడు నోటిఫికేషన్ ఏమీ రావు. మళ్లీ లాగ్ ఇన్ అయినప్పుడు అన్నీ కనిపిస్తాయి.
లాగ్ అవుట్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా రెడీ
కానీ ఇప్పుడు ఈ ఇబ్బందిని తొలగించేలా వాట్సాప్‌లో లాగ్ అవుట్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా రెడీ అయ్యింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇప్పటికే ఏ డివైస్‌లో వాట్సాప్ వాడుతున్నారో దాన్ని డీఆక్టివేట్ చేయకుండా, తాత్కాలికంగా వాట్సాప్‌ను ఆ డివైస్‌లో నుంచి లాగ్ అవుట్ చేయవచ్చు.
ఎవరైతే వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ ఉపయోగిస్తారో వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వేరే వాళ్లకి ఫోన్ ఇవ్వాల్సిన వస్తే వాట్సాప్ లాగ్ అవుట్ చేసి ఇవ్వొచ్చు. అప్పుడు వాళ్లు మీ వాట్సాప్ మెసేజ్ లు చూడలేరు.
మీ ప్రైవసీకి లాగ్ అవుట్ చాలా ముఖ్యం
మీరు వేరే వ్యక్తికి ఫోన్ ఇస్తున్నపుడు వారు మీ వ్యక్తిగత సందేశాలను చూడకుండా ఉండాలంటే లాగ్ అవుట్ ఫీచర్ చాలా అవసరం. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఉన్న ఈ లాగ్ అవుట్ ఫీచర్.. వినియోగదారుల ప్రైవసీని కాపాడటం కోసం వాట్సాప్ లోకి కూడా రానుంది. పైగా మీరు వాట్సాప్ ఏయే డివైస్‌లలో లాగిన్ అయి ఉన్నదీ కూడా ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
లాగ్ అవుట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది
ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో టెస్టింగ్ దశలో ఉంది. సాధారణ యూజర్లకు ఇది 2025 మధ్యలో లేదా చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారికంగా విడుదల తేదీని వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు.
ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ యూజర్లకు ఇతర సోషల్ మీడియా యాప్‌ల మాదిరిగానే వాడకంపై పూర్తి కంట్రోల్ లభిస్తుంది.