
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల గ్యాప్ తర్వాత మరికొద్ది సేపట్లో వెండితెరపై ప్రత్యక్షం కాబోతున్నాడు. సాహో చిత్రం మొట్టమొదటి షో దుబాయ్ లో మరికొద్ది సేపట్లో పడనుంది. కనీవినీ ఎరుగని విధంగా సాహోపై అంచనాలు నెలకొని ఉన్నాయి. 300 కోట్ల బడ్జెట్ లో సుజీత్ రూపొందించిన ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
'ప్రభాస్ అన్న, సుజీత్, సాహో చిత్ర యూనిట్ కలసి రేపు వెండితెరకి వేడెక్కించబోతున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నా.. తిరిగి రాగానే సాహో చూస్తా' అని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు.
'ఇండస్ట్రీలో తొలిసారి.. చిత్ర పరిశ్రమ మొత్తం ఒకే చిత్రం గురించి మాట్లాడుకుంటోంది. అదే సాహో. ఈ చిత్రాన్ని అన్ని రికార్డులని తుడిచిపెట్టేయాలి. ప్రభాస్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడనివారుండరు. సాహో చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు' అని సీనియర్ నటుడు జగపతి బాబు ట్వీట్ చేశారు.
సాహో చిత్ర యూనిట్ కి ఆల్ బెస్ట్. సినిమా కోసం మీరు పడ్డ శ్రమకు, పట్టుదలకు తగ్గ ఫలితం దక్కుతుంది. సాహో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది శ్రద్దా కపూర్, ప్రభాస్ అన్న, యువి క్రియేషన్స్ వారికి నా శుభాకాంక్షలు అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
సాహో చిత్రం పెద్ద విజయం సాధించాలని చిత్ర యూనిట్ ని, డార్లింగ్ ప్రభాస్ ని, దర్శకుడు సుజిత్ ని విష్ చేస్తున్నా. మీరు అద్భుతమైన పట్టుదల, కృషితో ఇండియన్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. సాహో చిత్రం చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని యంగ్ హీరో నితిన్ శుభాకాంక్షలు తెలిపాడు.
రికార్డులు బద్దలయ్యే రోజు రేపు. సాహో చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు అని మన్మథుడు 2 డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి :
కంగారు పెడుతున్న 'సాహో'.. అక్కడ 'అజ్ఞాతవాసి' రేంజ్ మాత్రమేనా!
నైజం కింగ్ ప్రభాస్: మహేష్ - పవన్ ల కంటే హై రేంజ్ లో..
'సాహో' సినిమా ఎందుకు చూడాలంటే..?
సాహో దెబ్బకు 'అవెంజర్స్' రికార్డ్ అవుట్ ?
సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!
సాహో: బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతంటే?
అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?
‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?
‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!
సచిన్ ని ఉదాహరణగా చెప్పి తన గౌరవం పెంచుకున్న ప్రభాస్!
సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!
అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!
‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?
హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్
'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?