జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

By narsimha lodeFirst Published Oct 28, 2018, 11:40 AM IST
Highlights

 వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు రాసిన  లేఖపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు

విశాఖపట్టణం: వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు రాసిన  లేఖపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.  పోలీసుల రిమాంద్ రిపోర్ట్‌లో ఓ  మహిళ పేరును కూడ  పోలీసులు చేర్చినట్టు తెలుస్తోంది.ఆ మహిళ పేరు రమాదేవిగా ఆ రిపోర్ట్ లో పోలీసులు చేర్చారు.

అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. పోలీసులు శ్రీనివాసరావును అరెస్ట్ చేసి విశాఖ జైలుకు పంపారు. అయితే  ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు  10 రోజుల పాటు కస్టడీకి కోరారు. కోర్టు  పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.

ఆదివారం నాడు  శ్రీనివాసరావును పోలీసులు తమ కస్టడీకి తీసుకొన్నారు. వాస్తవానికి నవంబర్ 2వ తేదీ వరకు శ్రీనివాసరావుకు జ్యూడీషీయల్ రిమాండ్ విధించింది కోర్టు.  అయితే పోలీసులు శ్రీనివాసరావును ఈ కసు విచారణ నిమిత్తం ఆదివారం  నాడు  కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే  శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్ట్‌ను  మీడియా బయట పెట్టింది.ఓ తెలుగు న్యూస్ ఛానెల్  ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని ప్రసారం చేసింది. మధ్యాహ్నం  పన్నెండున్నర గంటలకు జగన్  ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినట్టు శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

8 నిమిషాల పాటు జగన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఈ సమయంలోనే జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడడం వల్ల జగన్ భుజంపై  2 నుండి 3 ఇంచుల గాయమైందని ఆ రిపోర్ట్‌లో పొందుపర్చారు. 

అంతేకాదు శ్రీనివాసరావు 10 పేజీల లేఖపై కూడ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. చివరి పేజీనే శ్రీనివాసరావు ఎందుకు రాశాడు.. మిగిలిన 10 పేజీల లేఖను ఎవరితో రాయించాడనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు.

రిమాండ్ రిపోర్ట్‌లో ఓ  మహిళ ( రమాదేవి) పేరు కూడ ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. రమాదేవితో శ్రీనివాసరావుకు సంబంధం ఏమిటీ..రేవతిపతి, విజయలక్ష్మీలతో పాటు మరో మహిళ పేరు కూడ ప్రధానంగా ఉన్నట్టు సమాచారం.

అయితే  శ్రీనివాసరావుతో పాటు  రేవతిపతి, విజయలక్ష్మీతో పాటు మరో మహిళతో కలిపి విశాఖ పోలీసులు విచారణ చేయనున్నారు.  ఇప్పటికే  పోలీసులు  శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకొన్నారు. మరో వైపు శ్రీనివాసరావు తలకు బలమైన గాయం ఉందని పోలీసులు గుర్తించారు.

జగన్‌పై దాడి కేసు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది.  దీంతో  ఈ కేసును పారదర్శకంగా విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.  ఏపీ  పోలీసులపై తమకు నమ్మకం లేదని  వైసీపీ  చీఫ్ జగన్‌తో పాటు, ఇతర వైసీపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో  విచారణలో ప్రభుత్వానికి, పోలీసు శాఖపై విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

 

click me!