వేసవిలో కూరగాయల సాగుతో లాభాలు.. ఈ కూరగాయలు పండించడం ఉత్తమం

కూరగాయలతో సాగు జాస్తిగా ఉంటుంది. అయితే, మనం పండించే పంటకు తగినట్టుగా నీటి సదుపాయం అవసరం ఉంటుంది. అందుకే వేసవిలోనూ కూరగాయలు పండించి లాభాలు ఆర్జించాలంటే.. కొన్ని ప్రత్యేక రకాల కూరగాయలను వేయడం మంచిది. ముఖ్యంగా తీగ జాతి కూరగాయలు పండిస్తే వేసవిలోనూ మంచి దిగుబడి వస్తుంది.
 

these vegetable farming will bring profits in summer

హైదరాబాద్: కూరగాయల (Vegetable) సాగు (Cultivation) లాభసాటిగా ఉంటుంది. నీటి సదుపాయం, మార్కెట్ అందుబాటులో ఉంటే.. కూరగాయల సాగు సరైన ఆప్షన్. కూరగాయలను పండించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న లాభసాటిగా ఉండే కూరగాయలను పండించడం(Agriculture) మంచిది. ఎందుకంటే వేసవిలో నీటి లభ్యత అన్ని చోట్లా తగ్గిపోతుంది. కాబట్టి, నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. మంచి పంట వచ్చే కూరగాయల గురించి తెలుసుకుందాం. 

నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల కూరగాయలు పండించే విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తద్వార మార్కెట్‌కు వచ్చే పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. పంట తగ్గడం మూలంగా కూరగాయల ధరలూ పెరుగుతాయి. అయితే, రైతులు తమకు ఉన్న పరిమిత వనరులు, నీటితో సరైన ఆకు కూరలు వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయాలు పొందవచ్చు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర మినహా మిగతా ఆకు కూరలన్నీ వేసవిలో సాగు చేసి లాభాలు ఆర్జించవచ్చు.

ఎండకాలం ఎక్కువగా తీగజాతి కూరగాయలను సాగు చేయడం ఉత్తమం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీర, కాకర, సోరకాయ, పొట్టకాయ, దొండ పంటలు వేడి వాతావరణంలో మంచిగా పెరుగుతాయి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, శీతాకాలంలో ఈ పంటల ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. బీర, కాకర పంటలను చలి ఎక్కువగా ఉండే కాలంలో, ప్రాంతాల్లో సాగు చేయటం కొంచెం కష్టమే. కానీ, మిగతా తీగజాతి కూరగాయలను నీటి సదుపాయం ఉంటే ఏడాది పొడుగునా పండించుకోవచ్చు. ఈ పంటలను సాధారణంగా గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో కూడా పండిస్తుంటారు. చాలా మంది ఇంటి పందిళ్లు, నీళ్ల ట్యాంకుల దగ్గర పెంచుతుంటారు. అయితే, సాగు భూమిలోనూ ప్రత్యేకంగా పందిళ్లు వేసి వీటి సాగు ద్వారా లాభాలను మంచిగా ఆర్జించవచ్చు. ఈ పంటలను ఖరీఫ్, రబీ అనే తేడా లేకుండా వేసవి కాలాల్లోనూ పండించుకోవచ్చు. దొండ పంట మూడు నాలుగు ఏళ్లపాటు ఏడాది పొడుగునా కాపునిస్తుంది.

అయితే, కరివేపాకు సాగు కూడా మంచి లాభాలను ఇస్తుంది. ఈ పంట ఎక్కువ ఉష్ణోగ్రతల్లోనూ దిగుబడి వస్తుంది. అవే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గితే పెరుగుదల ఆగిపోయే ముప్పు ఉంటుంది. కానీ, ఈ పంటకు నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఈ పంటను నాటిన ఆరు నెలల తర్వాత కోతకు వస్తుంది. ఈ పంటను సరిగ్గా వేసుకుంటే ప్రతి మూడు నెలలకు ఒక సారి కోతకు వస్తుంది.

వీటితోపాటు వేసవిలో కాకుండా శీతాకాలంలోనైతే బంగాళా దుంపను పండించవచ్చు. ఇది శీతాకాలపు పంట. బంగాళా దుంపను సాగు చేయాలంటే చల్లని వాతావరణం అవసరం. ఎందుకంటే ఈ పంట ఎక్కువ టెంపరేచర్ ఉన్న చోట్ల పెరగదు. ఒక వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే భూమి లోపల దుంపలు బలవర్ధకం కాకుండా ఉపరితలంపై ఉండే శాఖలు పెరుగుతాయి. బంగాళ దుంప మొక్కల కొమ్మలు, ఆకులు పెరిగితే లాభం లేదు. కానీ, భూమి లోపల వేర్లు పెరగడం అవసరం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios