దేశానికి ఆదర్శంగా.. మహారాష్ట్ర వ్యవసాయ ఎగుమతి విధానం..

మహారాష్ట్ ప్రభుత్వం రైతుల్ని, వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర సూచనల మేరకు ఓ వ్యవసాయ ఎగుమతి విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 26 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి మీద దృష్టి సారించింది. 

Focus on exports, infra, harvest management in Maharashtras Agriculture Export Policy

మహారాష్ట్ర : ఫిబ్రవరి 25న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ఎగుమతి విధానాన్ని తెలిపింది. ఈ పాలసీ ప్రకారం 21 వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. 2018  డిసెంబర్ లో కేంద్రం వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా నిర్షిష్టమైన ప్రాంతంలో పండే ప్రత్యేకమైన ఉత్తత్తులు, geographical indication certification కలిగిన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించి, వాటి ఉత్పత్తి విషయంలో వారి స్వంత విధానాన్ని రూపొందించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను అనుసరించి, మహారాష్ట్ర ప్రభుత్వం 2019 మేలో ఒక విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

పాలసీ ఏమి చెబుతుంది?
ఎగుమతి ప్రమోషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 21 కమోడిటీ-నిర్దిష్ట క్లస్టర్‌లను గుర్తించింది. వీటిలో అల్ఫోన్సో మామిడి, కేసర్ మామిడి, అరటి, దానిమ్మ, ఉల్లిపాయ, జీడిపప్పు, నారింజ, ద్రాక్ష, sweet lime, పూల పెంపకం, ఎండుద్రాక్ష, బాస్మతీయేతర బియ్యం, పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు, బెల్లం, సుగంధ ద్రవ్యాలు (ఎర్ర మిరపకాయ, పసుపు) పాల ఉత్పత్తులు, మత్స్య, జంతు ఉత్పత్తులు ఉన్నాయి.

రాష్ట్రం 26 వ్యవసాయ ఉత్పత్తులకు GI ట్యాగ్‌ పొందింది. ఎగుమతి విధానం ఈ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడంపై దృష్టి పెడుతుందని మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ పవార్ అన్నారు. వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహానికి బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది కాకుండా, సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం, మౌలిక సదుపాయాలను సృష్టించడం, సముద్ర ప్రోటోకాల్, ట్రయల్ సరుకులను అభివృద్ధి చేయడంలో ఈ విధానం సహాయపడుతుంది. AEP కింద, రాష్ట్రంpost-harvest management కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్‌లను నియమించుకుంటుంది. నిర్దిష్ట ఉత్పత్తులకు చీడపీడలు లేని ప్రాంతాలను ఎంపికచేసుకుంటుంది. ఇది సమర్థవంతమైన ట్రేస్‌బిలిటీ సిస్టమ్‌ను అమలు చేయడంలో కూడా పాల్గొంటుంది.

అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA), మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA) వంటి కమోడిటీ బోర్డులు supply chain యాజమాన్యం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందజేస్తాయి. ఇందులో రైతు రిజిస్ట్రేషన్‌లు, సాంకేతిక సంస్థల ద్వారా రైతు శిక్షణ, FPO ఏర్పాటు, నాణ్యమైన ఇన్‌పుట్‌లను అందించడం, ధరల ఆవిష్కరణ, థార్డ్ పార్టీ ధృవీకరణ వంటివి ఉంటాయి.

పాలసీ ఎలా సహాయపడుతుంది?
రైతుల నికర ఆదాయాన్ని 40-45 శాతం పెంచే అవకాశం ఉన్న ఎగుమతులపై ఈ విధానం దృష్టి సారిస్తుందని, వ్యవసాయ ఎగుమతి చైన్ లోని వాటాదారులకు మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శి (సహకారం, మార్కెటింగ్) అనూప్ కుమార్ చెప్పారు."రైతులకు లాభదాయకమైన రాబడిని ఇవ్వడానికి దేశీయ మార్కెట్ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంది" అని కుమార్ చెప్పారు.

వ్యవసాయ ఎగుమతులలో పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయడంలో, export basketను వైవిధ్యపరచడంలో కూడా AEP సహాయం చేస్తుంది. మహారాష్ట్ర AEP ప్రకారం, ప్రస్తుతం పంటల కోత తరువాత కలిగే నష్టాల్లో పాడైపోయే వస్తువులకు 5-10 శాతం, పాడైపోయే వస్తువులకు 30 శాతంగా ఉన్నాయి.

ఇతర రాష్ట్రాలు పరిస్తితి ఏంటి?
కేంద్రం 2018లో AEPని ప్రారంభించినప్పటి నుండి, 21 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర-నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేశాయి. దేశవ్యాప్తంగా, AEP 18 ఉత్పత్తుల ఎగుమతి ప్రచారం కోసం 41 క్లస్టర్‌లను గుర్తించింది, వీటిలో షోపియాన్ (జమ్మూ అండ్ కాశ్మీర్), కిన్నౌర్ (హిమాచల్ ప్రదేశ్) యాపిల్స్ కోసం, అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్), థేని (తమిళనాడు) అరటిపండ్ల కోసం, లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్) మహబూబ్ నగర్ (తెలంగాణ) మామిడి పండ్లకోసం, నాసిక్ (మహారాష్ట్ర) ద్రాక్ష కోసం, పైనాపిల్స్ కోసం సిఫాహిజాల (త్రిపుర), పసుపు కోసం పశ్చిమ జైంతియా హిల్స్ (మేఘాలయ)లు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios