Russia Ukraine Crisis: Google వార్తలను ర‌ష్యా పుతిన్ స‌ర్కార్  బ్లాక్ చేసింది. ర‌ష్యా- ఉక్రెయిన్ ల దాడిపై ఫేక్ వార్త‌ల‌ను అరిక‌ట్ట‌డానికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కొత్త రష్యన్ చట్టాల ప్ర‌కారం.. రష్యన్ మిలిటరీని కించపరిచే ఏదైనా సంఘటనను నివేదించడాన్ని చట్టవిరుద్ధం చేస్తుంది. 

Russia Ukraine Crisis: గ‌త నాలుగు వారాలు ర‌ష్యా సేనాలు ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతున్నాయి. ఇప్పటికే అనేక‌ ప్రాంతాలు ధ్వంసం చేసి.. స్మశాన వాటిక‌లుగా మారిపోయాయి. ఇటు ఉక్రెయిన్ ఆర్మీ కూడా ఏమాత్రం తగ్గేదేలే అన్న‌ట్టు ప్రతిఘ‌టిస్తున్నాయి. దీంతో 28 రోజులు అవుతున్న‌ ఇప్పటికి ఉక్రెయిన్ దేశాన్ని.. రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకొలేక పోయింది. ఈ స‌మ‌యంలో ఉక్రెయిన్ కు ప‌రోక్షంగా.. ప్రపంచ దేశాలు, నాటో దేశాలు సహకారం అందిస్తున్నాయి. దీంతో రష్యాను జెలెన్ స్కీ సైన్యం ఎదుర్కొంటున్నాయి.

ఓ వైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు.. ర‌ష్యా దాడులకు తెగబడుతుంది. పుతిన్ చ‌ర్య‌ను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా.. పుతిన్ తన మారణహోమాన్ని మాత్రం ఆపటం లేదు. ఇప్పటికే కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంస మయ్యాయి.

ఈ యుద్ద నేప‌థ్యంలోనే దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను వదిలి వేరే దేశాలకు వలస పోయినట్లు ఐక్య‌రాజ్య స‌మితి నివేదిక‌లు తెలుపుతున్నాయి. మరికొందరు జెలెన్ స్కీ పిలుపు మేరకు.. దేశం కోసం యుద్దంలో పాల్గొంటున్నారు. ఇటు పలు దేశాలు ఇప్పటికే రష్యాపై.. ఆర్థిక , వాణిజ్య, రవాణా తదితర అంశాలపై ఆంకలను విధించాయి. ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా, నెట్ ఫ్లీక్స్ తదితర సంస్థలు తమ సేవలన నిలిపేశాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఇటు పుతిన్ మాత్రం వేరే దేశాలు జోక్యంచేసుకుంటే.. అణుదాడులకు కూడా వెనుకాడం అంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పలు దేశాలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. ఇక.. పుతిన్ తమ దేశానికి వ్యతిరేకంగా వార్త ప్రసారాలు చేస్తే వారికి జైలు శిక్ష అంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం.. రష్యన్లను కించపర్చినట్లు గానీ, ఇతర వీడియోలను ప్రసారం చేయకూడదు.

తాజాగా. Google వార్తలను ర‌ష్యా పుతిన్ స‌ర్కార్ బ్లాక్ చేసింది. ఉక్రెయిన్‌లో ర‌ష్యా చేస్తున్న దారుణాల‌ను ప్ర‌సారం చేస్తున్న‌ట్టు.. యాక్సెస్‌ను అనుమతించిందని ఆరోపిస్తూ రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ఆల్ఫాబెట్ యొక్క గూగుల్ న్యూస్‌ను బ్లాక్ చేసిందని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ బుధవారం తెలిపింది. ఏజెన్సీ వివరాలు ఇవ్వలేదు. కొత్త రష్యన్ చట్టాల ప్ర‌కారం.. రష్యన్ మిలిటరీని కించపరిచే ఏదైనా సంఘటననైనా ప్రసారం చేయ‌డం చట్టవిరుద్ధం. రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం నుండి వచ్చిన అభ్యర్థనపై రెగ్యులేటర్ రోస్కోమ్నాడ్జోర్ చర్య తీసుకున్నట్లు ఇంటర్‌ఫాక్స్ తెలిపింది.

ఉక్రెయిన్ భూభాగంలో ర‌ష్యా సైనికులు చేస్తున్న దారుణాలను తెలియ‌జేయ‌డం.. యుద్దానికి సంబంధించిన వార్త‌ల‌ను.. అసమంజసంగా.. స‌మాచారాన్ని బహిరంగ ప‌ర‌చ‌డం లేదా వార్త‌ల‌ను ప్రచురణ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై న్యూస్ ను బ్యాన్ చేశార‌ని ఇంటర్‌ఫాక్స్ .. రెగ్యులేటర్‌ను ఉటంకిస్తూ పేర్కొంది. కొత్త రష్యన్ చట్టం ప్ర‌కారం.. రష్యన్ మిలిటరీని కించపరిచే ఏదైనా సంఘటనను బ‌హిర్బంగతం చేయ‌డం చట్టవిరుద్ధం