Russia Ukraine War : ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతోన్న భీకర పోరులో ఉక్రెయిన్ సైన్యం కూడా పుతిన్ సైన్యానికి గట్టిగానే సమాధానమిస్తోన్నట్టు ఆంగ్ల వార్తాపత్రిక ది కైవ్ ఇండిపెండెంట్ తెలిపింది. ఈ పత్రిక ప్రకారం.. ఉక్రెయిన్ ఇప్పటివరకు 16,400 మంది రష్యన్ సైనికులను చంపింది. అలాగే.. 117 విమానాలు, 127 హెలికాప్టర్లు, 575 ట్యాంకులు, 293 ఆర్టిలరీలు, 1640 సాయుధ వాహనాలు, 91 ఎంఎల్‌ఆర్‌ఎస్, 7 బోట్లు ధ్వంసం చేసినట్టు తెలిపింది.
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా భీకర పోరు సాగిస్తోంది. రష్యా సైనిక చర్య ప్రారంభించి.. నెల రోజులు దాటింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసింది రష్యా సైన్యం. ఈ యుద్దంలో వేలాది మంది అమయాకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఉక్రెయిన్లు ప్రాణాలు చేపట్టుకుని.. పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. కోట్లాది ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో యుద్దం విరమించాలని ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. పుతిన్ మాత్రం.. ఎవ్వని మాట వినని సీతయ్య లాగా ప్రవర్తిస్తోన్నాడు.
ఇదిలా ఉంటే.. తొలుత రష్యాన్ సైనికులకు భయపడ్డ ఉక్రెయిన్.. ప్రస్తుతం ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతుంది. రష్కన్ సేనాలను ఉక్రెయిన్ సైన్యానాలు ఉక్కబిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. మిలటరీ యాక్షన్ ప్రారంభం నుంచి నేటి వరకుఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు. గత నెల రోజులుగా నిత్యం ఏదొక చోట రష్యా ఉక్రెయిన్ పై క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. తమ కంటే..దాదాపు 5 రేట్లు ఎక్కువ సామర్థం ఉన్న రష్య సైన్యాన్ని ఉక్రెయిన్ సైన్యం ముప్పుతిప్పలు పెడుతోంది. గత నెల రోజులుగా రాజధాని నగరం కీవ్ ను ఆక్రమించలేక పోయిందంటే.. అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ప్రతిఘటిస్తోంది. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాను ఏ మేరకు నష్టపరించిందో ఆంగ్ల వార్తాపత్రిక ది కైవ్ ఇండిపెండెంట్ నివేదించింది. ది కైవ్ ఇండిపెండెంట్ ప్రకారం, ఉక్రెయిన్ ఇప్పటివరకు 16,400 మంది రష్యన్ సైనికులను చంపింది. అలాగే 117 విమానాలు, 127 హెలికాప్టర్లు, 575 ట్యాంకులు, 293 ఆర్టిలరీలు, 1640 సాయుధ వాహనాలు, 91 ఎంఎల్‌ఆర్‌ఎస్, 7 బోట్లను ధ్వంసం చేసింది. అంతే కాకుండా.. 56 యుఎవిలు, 51 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్, 2 ప్రత్యేక పరికరాలు, 1,131 వాహనాలు, 73 ఇంధన ట్యాంకులు కూడా ధ్వంసం చేసినట్టు తెలిపింది.
అలాగే.. ఖేర్సన్ నగరంలో జరిగిన దాడుల్లో రష్యాన్ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజంట్‌సెవ్ చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన ఏడుగురు సైనిక జనరళ్లు మృతి చెందినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో మొదట స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ నగరంపై పుతిన్ సేనలు పట్టు కోల్పోతున్నట్లు అమెరికా తెలిపింది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉక్రెయిన్ విదేశాంగ, రక్షణ మంత్రితో నేడు వెర్సాలో సమావేశం కానున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో రష్యా బలగాలు ఇప్పుడు తమ దృష్టిని రాజధాని కైవ్‌పైకి మళ్లిస్తున్నాయని, బదులుగా ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్ పారిశ్రామిక ప్రాంతాన్ని విముక్తి చేయడంపై దృష్టి సారించాయని US అధికారులు చెబుతున్నారు. అలాగే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యం దేశంలోని అనేక ప్రాంతాల్లో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు మరియు సామగ్రి సరఫరాను పెంచుతున్నాయి.
