Russia Ukraine War : ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ ను దక్షిణ, ఉత్తర కొరియా మాదిరిగా రెండుగా విభజించాలని రష్యా భావిస్తోందని ఆరోపించారు. దేశం ముక్కలు కాకుండా ఉండేందుకు గొరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
Russia Ukraine War : దక్షిణ, ఉత్తర కొరియా మాదిరిగా ఉక్రెయిన్‌ను రెండుగా విభజించాలని రష్యా భావిస్తోందని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆరోపించారు. దేశం ముక్కలు కాకుండా ఉండేందుకు గొరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి కైరిలో బుడనోవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర, దక్షిణ కొరియాలను ఎలా విభజించారో.. అదేవిధంగా ఉక్రెయిన్ కూడా రెండుగా విభజించాలని రష్యా కోరుకుంటోందని అన్నారు. ఉక్రెయిన్ ముక్కలు కాకుండా ఉండేందుకు గొరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను రష్యా చేపట్టి నెల రోజులు దాటింది. అయితే, ఉక్రెయిన్ రష్యా బలగాలను అడ్డుకోవడంలో విజయం సాధిస్తుందని బుడనోవ్ అంచనా వేశారు.
అయితే తొలి దశ సైనిక ఆపరేషన్ ముగిసిందని రష్యా పేర్కొంది. ఇక తమ దృష్టంతా డాన్‌బాస్‌పైనే అని తెలిపింది. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించే ముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రేనియన్ డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాంతమే డాన్‌బాస్. డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాలు గత 8 ఏండ్లుగా వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్నాయి. డోన్‌బాస్‌లోని రెండు ప్రావిన్సులైన డోనెట్స్క్, లుహాన్స్క్ విముక్తి పై దృష్టి సారించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన సైనిక వ్యూహాన్ని మారుస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. గత చర్చల ఫలితంగా.. ఉక్రెయిన్ లో కారిడార్లను తెరవడానికి రష్యా అంగీకరం తెలిపింది. అలాగే..తదుపరి శాంతి చర్యల కోసం రష్యా మరియు ఉక్రెయిన్ సోమవారం సమావేశం కానున్నాయి. అయితే.. రష్యా ఇప్పటివరకూ భారీ సంఖ్యలో తన సైన్యాన్ని కోల్పోయింది. అలాగే ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా తీవ్రతరం అయిన నేపథ్యంలో రష్యా కాస్త వెనక్కి తగ్గే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు 7,000 నుండి 15,000 మంది రష్యన్ సైనికులు మరణించారని పలు నివేదికలు తెలుపుతున్నాయి.
నష్టాల నివేదికల మధ్య సైనిక వ్యూహంలో ఈ మార్పు వచ్చింది. మాస్కో నివేదిక ప్రకారం ఉక్రెయిన్ ఉన్నంత కాలం పాటు కొనసాగుతుందని ఊహించలేదు, ఇప్పుడు దాదాపు ఒక నెల పాటు పూర్తి రష్యన్ స్వాధీనం నుండి తప్పించుకోగలిగింది. NATO ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది,
ఈ నేపథ్యంలో యుఎస్‌లోని ఉక్రేనియన్ రాయబారి ఒక్సానా మార్కరోవా మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం లేదని ధృవీకరించారు, రష్యాతో చర్చల పట్టికలో ఈ ప్రాంతం లేదని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగంలో స్వతంత్ర రిపబ్లిక్లు లేవని తెలిపింది. "రష్యా ఈ దురాక్రమణను ఆపడానికి మనం ఏమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ను అడగకూడదని నేను భావిస్తున్నాను. దానిని ఆపడానికి మనం ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనమందరం ప్రతి ఒక్కరినీ అడగాలని సూచించారు.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమ దేశాల తీరుపై మండిపడుతున్నారు. రష్యాకు వారంతా భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే తమ దేశానికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. పేరుకుపోయిన పాత క్షిపణులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. నాటోలోని ఒక్క శాతం యుద్ధ విమానాలు, ఒక్క శాతం ట్యాంకులను తమకు ఇచ్చినా రష్యా దాడిని ఎదుర్కోగలమని అన్నారు. ఉక్రెయిన్ ఇంధన, ఆహార నిల్వ కేంద్రాలను రష్యా ధ్వంసం చేస్తున్నదని ఆయన వాపోయారు.
