హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 19, 2022) స్థిరంగా ఉన్నాయి. ధరలు . మే 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులకు భారీ ఊరట దక్కింది.
భారతీయ చమురు కంపెనీలు మే 21 నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 18 ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధర రేట్లు స్థిరంగానే ఉన్నాయి. జూన్ 15న పెట్రోల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్లో పెట్రోల్ రేటు రూ. 109.66 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.82 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరల గ్రాఫ్ పైపైకే వెళ్తోంది. 118 డాలర్ల వరకు తగ్గిన క్రూడ్ ధర మళ్లీ పెరిగింది. 122 డాలర్లకు చేరింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 122.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లోనూ దాదాపు ఇదే ప్రైస్ కనిపిస్తోంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 120.96 డాలర్లు పలుకుతోంది.
అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కాసింత తగ్గుముఖం పట్టాయి. నిన్నటివరకు 120 డాలర్లకు పైగా పలికిన బ్యారెల్ క్రూడ్ రేటు కాస్త తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 118.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదివరకు ఈ ధర 123 డాలర్లుగా ఉండేది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లోనూ దాదాపు ఇదే ప్రైస్ కనిపిస్తోంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 116.74 డాలర్లు పలుకుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (శుక్రవారం, జూన్ 10, 2022) కూడా స్థిరంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ గత నెలలో తగ్గించింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది.