రాజకీయంగా తనను నిర్వీర్యం చేయడానికే కొందరు ప్రయత్నిస్తున్నారని యూపీ బీజేపీ నాయకుడు శ్రీకాంత్ త్యాగి అన్నారు. కోర్టుకు వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మహిళకు తనకు సోదరిలాంటిదని చెప్పారు.
Shrikant Tyagi Case: ఢిల్లీలోని నోయిడా హౌసింగ్ సోసైటీలో మహిళపై దాడి,దూషించిన కేసులో పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారం మీరట్‌లో అరెస్టు చేశారు. సిద్ధాపురి కాలనీలో తన సన్నిహిత మిత్రునితో కలసి దాక్కున్న త్యాగిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Gyanvapi case: జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభయ్ నాథ్ గుండెపోటు రావడంతో మరణించారు.
Sharjeel Imam Case: 2019 దేశద్రోహం కేసులో మధ్యంతర బెయిల్‌ను తిరస్కరిస్తూ.. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు షర్జీల్ ఇమామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో పోలీసులు విచారణను పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. నేరం నిరూపించేందుకు గాను పక్కా ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సీసీ ఫుటేజ్, కాల్ సీడీఆర్‌లు కీలకం కానున్నాయి
DHFL bank fraud case: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ జూన్ 20న DHFL bank పై కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్ని పరిశీలిస్తే 2010-2018 వరకు ఎనిమిదేళ్ల కాలంలో యూనియన్ బ్యాంకు కన్సార్టియం నుంచి డిహెచ్ఎఫ్ఎల్కు దాదాపు రూ.42,871 కోట్ల రుణాన్ని అందించింది.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండో విడత విచారణ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియాగాంధీ స్టేట్మెంట్ను నమోదు చేసి, రేపు అంటే జూలై 27న మళ్లీ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది.
National Herand Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండోసారి ప్రశ్నించడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు .
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లఖింపూర్ ఖేరి హింస ఘటన కేసులో అలహాబాద్ హైకోర్టు మరో సారి అశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారని పేర్కొంది.