Asianet News TeluguAsianet News Telugu

Amnesia Pub Rape Case : 56 రోజులు.. 65 మంది సాక్షులు, 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో పోలీసులు విచారణను పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. నేరం నిరూపించేందుకు గాను పక్కా ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సీసీ ఫుటేజ్, కాల్ సీడీఆర్‌లు కీలకం కానున్నాయి

jubilee hills police filed chargesheet in amnesia pub rape case
Author
Hyderabad, First Published Jul 28, 2022, 8:44 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. రెండు కోర్టుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 56 రోజుల్లోనే పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేయడం విశేషం. జువైనల్ కోర్టుతో పాటు నాంపల్లి కోర్టులో గురువారం ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు పోలీసులు. సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు నమోదు చేశారు. సాదుద్దీన్‌తో పాటు ఎమ్మెల్యే కుమారుడిపైనా అభియోగాలు మోపారు. ఈ కేసులో మొత్తం 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించారు. మొత్తం 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 

ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు, పొటెన్షివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. బాలికను ట్రాప్ చేసిన నిందితులు ఆమెపై కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేశారు నిందితులు. తమ కుటుంబాలకు వున్న పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించే యత్నం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు జువైనల్స్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

Also REad:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్

ఇకపోతే.. అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుమారుడికి బుధవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే నలుగురు మైనర్ నిందితులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో వుండటంతో ఆయన జువైనల్ హోంలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన తర్వాత ఎమ్మెల్యే కొడుకుకు హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios