National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండో విడత విచారణ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోనియాగాంధీ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి, రేపు అంటే జూలై 27న మళ్లీ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది.

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో విడత విచారణ మంగళవారం సాయంత్రం ముగిసింది. సోనియా గాంధీని ఈడీ దాదాపు ఆరు గంటల పాటు విచారించింది. ఈడీ ఎదుట సోనియాగాంధీ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడిని రేపు అంటే జూలై 27న మరోసారి ప్రశ్నించనున్నారు. తొలి రౌండ్‌లో సోనియా గాంధీని ఈడీ అధికారులు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సోనియా గాంధీ మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకుని, ఆ తర్వాత మళ్లీ ఆమెపై విచారణ ప్రారంభించారు. అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. రేపు అంటే బుధవారం మరోసారి విచారణకు హాజ‌రుకావాల‌ని ఈడీ సోనియాను పిలిచింది. ఈ మేరుకు సోనియాకి ఈడీ స‌మాన్లు జారీ చేసింది.

కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. రాహుల్ గాంధీ మరో ట్వీట్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం 50 మంది ఎంపీలతో పాటు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సమయంలో కూడా అతని ఉత్సాహం తగ్గలేదు. మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ మరో ట్వీట్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తప్పుడు జీఎస్‌టీ, అగ్నిపథ్‌పై ఎవరు ప్రశ్నలు అడుగుతారో.. తనను జైల్లో పెట్టమని దేశ 'రాజు' ఆదేశించారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేను ఇప్పుడు కస్టడీలో ఉన్నా.. దేశంలో ప్రజల గొంతుక ఎత్తడం నేరం అయినప్పటికీ, వారు మన మనోభావాలను ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు, కార్యకర్తలు వాహనాలకు నిప్పు పెట్టారు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోనియా గాంధీపై ఈడీ చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలకు నిప్పంటించగా, మ‌రికొంద‌రు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండా చేత‌బ‌ట్టి నినాదాలు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భోజన విరామం తర్వాత కొన‌సాగిన ఈడీ విచార‌ణ‌

భోజన విరామం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మంగ‌ళ‌వారం ఆమెను రెండు సార్లు ఈడీ ప్రశ్నించింది. దాదాపు ఆరు గంట‌ల‌పాటు ఈడీ విచార‌ణ సాగింది. మరోవైపు ఈడీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా 50 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ చర్యను నిరసిస్తూ.. కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసింది. ఈడీ చర్యను వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా 50 మంది ఎంపీలను ఢిల్లీలోని కింగ్స్‌వే క్యాంప్‌లోని పోలీస్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఇంతలో ఆ ప్రదేశానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వీడియోను చూస్తుంటే.. నిర్బంధంలో ఉన్న 50 మంది ఎంపీలు ఆ ప్రదేశాన్ని మేధోమథనానికి కేంద్రంగా మార్చుకున్నారని తెలుస్తుంది. జీఎస్టీ, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ వంటి అంశాలపై ఎంపీలు చర్చిస్తున్నట్లు వీడియోలో కనిపించింది.