వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.