తమ నేత పవన్ కల్యాణ్ చేసిన పోరాటం వల్లనే దిశ రేప్, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని చెబుకుంటున్నారు ఆయన అబిమానులు. పవన్ కల్యాణ్ చిత్రపటం పెట్టి ఫ్యాన్స్ 101 కొబ్బరికాయలు కొట్టారు.
దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ మీద కొంత మంది న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని వారు ఆరోపించారు.
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఇటీవల చోటుచేసుకున్న దిశా సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమవ్వడంపై డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదని వాపోయారు తల్లి షంషాద్ బేగం. సజ్జనార్ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు.
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. జయహో తెలంగాణ పోలీస్ అంటున్నారు.
అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.. అయితే... నిజంగానే పారిపోతుంటే చేశారా లేదా... కావాలని చంపి అలా చెబుతున్నారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రశ్న మానవ హక్కుల సంఘాల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ ఎన్ కౌంటర్ ని వెనక ఉండి నడిపించింది సీపీ సజ్జనార్. అందుకే.. ఆయనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలుత నిందితులను జైల్లో పెట్టి మేపుతున్నారని ఆరోపించినవాళ్లే... ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై పోలీస్.. జై జై పోలీసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
దిశ హత్య కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు దిశ సెల్ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.