Union Budget 2025 పై వేతన జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు అనేక మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ప్రాథమిక మినహాయింపు పరిమితి పెంపు, ఆదాయపు పన్ను మినహాయింపులు పెంపు, NPS పెట్టుబడి పరిమితి పెంపు, గృహ రుణ వడ్డీ మినహాయింపులో సర్దుబాట్లు, మూలధన లాభాల పన్నులో సవరణలు వంటివి ఇందులో ఉన్నాయి.