Union Budget 2024: వ్యవసాయానికి రూ.1.52లక్షల కోట్లు, ఆర్గానిక్ ఫామింగ్ పై స్పెషల్ ఫోకస్..!

2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Union Budget 2024: 1.52 Lakh Crore for Agriculture ram


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 3వ పర్యాయం తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ ఇది. మోదీ ప్రభుత్వానికి ప్రజలు 3వ దఫా చరిత్రాత్మక విజయాన్ని అందించారని బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

మహిళలు, యువత, రైతులు, పేదలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ను రూపొందించామని పేర్కొన్న ఆర్థిక మంత్రి.. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగంలో డిజిటల్‌ వినియోగం పెరుగుతుంది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి సంబంధించి డిజిటల్ సర్వే నిర్వహించనున్నారు. పప్పులు, ఆవాలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో 1.48 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు. 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూరేలా 5 పథకాలను రూపొందించారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి రాబోయే 2 సంవత్సరాలలో కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో పాల్గొంటారని కూడా పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios