Andhra Pradesh Budget 2024-25 : శాఖల వారిగా నిధుల కేటాయింపులు : ఇక్కడా పవన్ దే పై చేయి, ఎన్నికోట్లో తెలుసా?
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427 కోట్ల బడ్జెట్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. మరి ఇందులో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? పవన్ కల్యాణ్ శాఖకు ఎన్ని నిధులు దక్కాయి?
Andhra Pradesh Budget 2024-25
Andhra Pradesh Budget 2024-25 : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2024-25 ని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలలకు గాను బడ్జెట్ కేటాయింపులు చేపట్టారు. ఇలా రూ.2,94,427 కోట్ల
బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టారు పయ్యావుల.
ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ ఓ నాలుగు నెలలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ మరో నాలుగు నెలల కాలాని ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలల సమయం వుంది. కాబట్టి ఈ కాలానికి మళ్లీ ఓటాన్ అకౌంట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ను రూపొందించింది కూటమి సర్కారు. ఇందులో ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ తో పాటు ఇరిగేషన్, రోడ్ల నిర్మాణంకు పెద్దపీట వేసారు.
Andhra Pradesh Budget 2024-25
2024-25 బడ్జెట్
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ కేటాయింపులు రూ.2,94,427 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
జిఎస్డిపి లో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
Andhra Pradesh Budget 2024-25
పవన్ శాఖలకు నిధుల ప్రవాహం :
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2024-25 లొ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కు ఎంతటి ప్రాధాన్యత వుందో ఈ కేటాయింపుల ద్వారానే అర్థమవుతుంది. బడ్జెట్ ప్రసంగం సమయంలో పయ్యావుల కేశవ్ డిప్యూటీ సీఎం పనితీరును ప్రశంసించారు.
పవన్ కల్యాణ్ నిర్వర్తిస్తున్న పంచాతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు రూ.16,739 కోట్లను కేటాయించారు. ఇక అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖకు రూ.687 కోట్లు కేటాయించారు. ఇలా కేవలం ఒక్క పవన్ మంత్రిత్వ శాఖలకే 17 వేల కోట్లకు పైగా నిధులు దక్కాయి.
ఇక ఇటీవల ఏకకాలంలో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయితీల్లో గ్రామసభల నిర్వహణ ద్వారా ప్రపంచ రికార్డు సాధించినట్లు పయ్యావుల గుర్తుచేసారు. ఇక అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైందన్నారు. గత గణతంత్ర దినోత్సవ నిర్వహణ ఖర్చులను చిన్న గ్రామపంచాయితీల్లో రూ.100 నుండి రూ.10వేలకు... పెద్ద పంచాయితీల్లో రూ.250 నుండి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. స్వర్ణ పంచాయితీ కార్యక్రమం కింద పంచాయితీల అభివృద్దికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇలా పవన్ కల్యాణ్ పనితీరు గురించి ఆర్థిక మంత్రి నిండు సభలో, బడ్జెట్ ప్రసంగంలో కొనియాడారు.
Andhra Pradesh Budget 2024-25
శాఖలవారిగా కేటాయింపులు :
పరిశ్రమల శాఖ రూ.3,127 కోట్లు
నీటిపారుదల శాఖ రూ.16,705 కోట్లు
గృహనిర్మాణ శాఖ రూ.4012 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ది శాఖ రూ.11,490 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ రూ.18,421 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
వెనకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం రూ.39,007 కోట్లు
మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
ఇంధన రంగం రూ.8,207 కోట్లు
పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు
వ్యవసాయం,అనుబంధ రంగాలక 11,855 కోట్ల రూపాయలు
రోడ్లు, భవనాల శాఖకు రూ.9554 కోట్లు
యువజన,పర్యాటక, సాంస్కృతికి శాఖ రూ.322 కోట్లు
దీపం పథకానికి రూ.895 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు రూ.2,326 కోట్లు