డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 02, అవమానం - 04

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి వ్రుత్తి పరమైన జీవనంలో చక్కటి విజయం సూచించుచున్నది.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం లాభస్థానం వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతీ వ్యవహారం అవలీలగా నెరవేరును. చక్కటి మిత్ర వర్గం మాత్రం లభించును. నూతన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన  వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 20 నవంబర్ 2021 నుండి మీ చేతిపై ధర్మ కార్య సంబంధ వ్యయం తరచుగా ఏర్పడును. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న విహార యాత్రలను అనుభవించ కలుగుతారు.  

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన  సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. ఆర్ధికంగా విశేష యోగం అనుభవిస్తారు. శని వలన ఈ సంవత్సరం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏమి లేవు. మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు, సంతోషములు ఏర్పడును. రాహు కేతువుల వలన అన్ని వర్గముల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును. ( వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.)

* రాజకీయ సంబంధమైన జీవితం బాగుంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఒడి దుడుకులు ఉంటాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. సంవత్సర ద్వితీయార్ధం అక్టోబర్ లో వివాహాది శుభకార్యాలు ముడిపడుతాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభించును. అవసారాలకు ధనం ఎదో రూపంలో మీ దగ్గరకు వస్తుంది.. గృహ నిర్మాణం చేయుట, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుట జరుగును. నవంబర్ నుండి గృహంలో కలవరములు  సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఉద్యోగ మార్పు. పొత్తుతో చేసే వ్యాపారాలలో అవక తవకలు ఏర్పడతాయి. 

ఈ కింది రాశులవారి జాతకాలు కూడా చూడండి.

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మకర రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో తులారాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కన్యరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో సింహరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం