ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారి జాతకం
తెలుగు ప్రజలకు యుగాది ఉగాది పర్వదినం అత్యంత విశిష్టమైంది. కొత్త తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ప్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారి జాతకం ఎలా ఉందో చూడండి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనస్సురాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 07, అవమానం - 05
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది.
ధనస్సురాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు ఈ సంవత్సరంలో కూడా ఏలినాటి శని చివరి అంకం 17 జనవరి 2023 వరకు ఉన్నది.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనస్సురాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.
ధనస్సురాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైశ్చరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనస్సురాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శనికి శాంతి జపములు చేయించుకొనుట మంచిది.
రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర వహిస్తారు.
* జీవితభాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి. ఇతరులకు ఇచ్చిన డబ్బులు అంత సులువుగా తిరిగిరావు. మీ మనస్సులోని భావాలను ఇతరులకు తెలియజేయడం వలన చాలా మంది విరోధులు అవుతారు. కొంత అపఖ్యాతి,అపనిందలు వస్తాయి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగలో అభివృద్ధి కనబడుతుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది. చండి హోమక్రతువు జరిపించుకోవడం వలన ఆరోగ్య,ఆర్ధికంగా కొంత అనుకులతలు కనబడతాయి.