ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం

తెలుగు ప్రజల నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఉగాది పర్వదినం రాబోతోంది. వచ్చే ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం ఎలా ఉందో చూడండి.

ugadi 2021: karkataka Raasi, cancer raasi phalalu in Plava Nama year

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 06, అవమానం - 06

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటకరాశి వారికి వ్రుత్తి వ్యాపారాలలో కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20 నవంబర్ 2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు  ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలోగురువు నీచ క్షేత్ర లేదా శత్రు స్థానాలలో కలిగి ఉన్న కర్కాటకరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. 

రాహువు - కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి విజయం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. 

అవివాహితులకు వివాహ యోగం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును. భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయాలలో దూరం అవడం కానీ లేదా విడిపోవడం కాని శాశ్వతంగా దూరం అవ్వడం కాని జరిగే ఆస్కారం ఉంది. రాజకీయ రంగాలలో రానిస్తారు. జీవితంలో కొంత మంది దూరం అవుతారు. వ్యాపారంగా వచ్చిన  ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారు.  కుటుంబంలో అందరితో కలిసి ఉన్నా మీరు ఒంటరివారన్న భావన చెందుతారు.విద్యా సంబంధిత విషయాలలో, విదేశియాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. 

Also Read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios