సింహరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4, పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 02, వ్యయం - 14, రాజ పూజ్యం - 02, అవమానం - 02.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి అన్ని వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

సింహరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్-2022 వరకు గురు గ్రహం వలన 19 నవంబర్ 2021 వరకు కలిసి రాదు. గత శార్వరి నామ సంవత్సరపు సమస్యలు కొనసాగును. 20 నవంబర్ 2021 నుంచి గురు గ్రహం యోగించును. ఆర్ధికంగా నూతన అవకాశములు కలుగ చేయును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. వైవాహిక జీవన సుఖసౌఖ్యాలు పొందుదురు. దీర్ఘకాలికంగా కళత్ర జీవనంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పరచును.

సింహరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు లభించును. కుటుంబ మరియు వ్రుత్తి సంబంధ శత్రువులపై విజయం పొందుదురు. తగాదాలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు సింహరాశి వారికి అనుకూలంగా ముగియు సూచనలు అధికంగా ఉన్నవి. 

రాహువు - కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్ భాగ్యములు లభించును. విశేషమైన ధనార్జన ఏర్పరచును. మాత్రు వర్గం వలన లాభాపడుడురు. భూ లేదా గృహ సౌఖ్య ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం. రాహు - కేతువుల వలన విద్యా పరంగా విద్యార్థులకు అతి చక్కటి  ఫలితాలు ఏర్పరచును. 

మీరు ఎంత సర్దుకు పోయినా వివాదాస్పదంగానే ముద్రపడతారు. అందరితో కలసి పనిచేయరు, ఒంటరిగానే సాధిస్తారు.  విదేశీ సంబంధిత విషయాలలో వీసా, గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మనోధైర్యం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది. బంధువులతో, సన్నిహితులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళ నొప్పులు,  వైరస్ వలన కొంత ఆరోగ్యం చికాకు పరుస్తుంది. రాజకీయ నాయకులకు, నటులకు, గాయకులకు సంవత్సర చివరి కాలం యోగాదాయకంగా ఉండును. నరదృష్టి అధికంగా ఉండును. 

Also read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం
Also Read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం