ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశివారి జాతకం
యుగాది ఉగాది తెలుగు ప్రజలకు అత్యంత విశిష్టమైన పర్వదినం. తెలుగు ప్రజల సంవత్సరాది ఉగాది. ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశివారి జాతకం ఎలా ఉందో చూద్దాం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం - 14, రాజ పూజ్యం - 06, అవమానం - 01
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎదురగు శారీరక మరియు మానసిక సమస్యలను సూచించుచున్నది.
కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి ఏలినాటి శని ప్రధమ పర్యాయ ప్రభావంతోనే ఉన్నారు. ఈ ఏలినాటి శని 23 ఫిబ్రవరి 2028 వరకు ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గురు గ్రహం వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు సంతానం వలన లేదా సంతాన విషయ మూలక సమస్యలు, సోదర, సోదరి వర్గం వలన ఇబ్బందులు, మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును. 20 నవంబర్ 2021 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన విధానంలో ఆశించిన ఉన్నతి పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా అనుకూల మార్పులు లభిస్తాయి. శరీర బరువు అదుపులో పెట్టుకోవలెను. నరముల లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శనైశ్చరుడు వ్యయ స్థానంలో ఉండుట వలన సంవత్సరం అంతా యోగించడు. కుంభరాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా వాహనాలు, ప్రయాణాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. వ్యాపార రంగం లోని వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుడం మంచిది కాదు. బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు. వ్యయ స్థాన గతుడైన శని వలన వడ్డీల వలన భాదపడు సూచనలు అధికంగా ఉన్నవి. తరచుగా శనికి తైలభిషేకలు జరుపుట మంచిది.
రాహు - కేతువులు ఇరువురి వలన కుంభరాశి వారందరూ చక్కటి అనుకూల ఫలితాలు లభించును. ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి మిక్కిలి ప్రతిష్టాత్మక పదవులు లభింప చేయును. విద్యార్ధులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును. పర దేశ విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు లాభించును.
* అవివాహితులకు వివాహకాలం. మీకు ఇష్టమైన ఉద్యోగం వస్తుంది. కోరుకున్న చోట చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. స్వగృహ యోగ్యత కలుగుతుంది. మీపై కొంతమంది అసూయా ద్వేషాలు చిలికి చిలికి గాలివాన అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం కావు. వ్రుత్తి ఉద్యోగాల పరంగా కలిసి వస్తుంది. లాభం వచ్చినధనాన్ని పొదుపు లేక పెట్టుబడి రూపంలో పెడతారు. మీరు విరోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మీపై ఆరోపణలు వస్తాయి. కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బందిని కలిగిస్తాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వలేదని విమర్శలు వస్తాయి. ఈ సంవత్సరం జీవితం మంచి గొప్ప మలుపు తిరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు, గొప్ప ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్యం ఉన్న పెద్దగా బాధించదు.
ఈ కింద రాశిఫలాలు కూడా చూడండి.
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మకర రాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో తులారాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కన్యరాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో సింహరాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం
ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం
శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం
శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం