ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం
తెలుగువారి యుగాది ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరం రాబోతోంది. వచ్చే ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి వారి జాతకం ఎలా ఉందో చూడండి.
మిధునరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మృగశిర 3 , 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించినవారు మిధునరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజ పూజ్యం - 03 అవమానం - 06
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి చేపట్టిన వ్రుత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.
మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత , దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు , రక్త లేదా మెదడు నరాలకు సంబందించిన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పరచును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును. మిధున రాశి కి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20-నవంబర్-2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని విధములా గురు గ్రహం 20-నవంబర్-2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును.
మిధునరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అష్టమశని ప్రభావం వలన అనుకూల ఫలితాలు అంతగా ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు కొనసాగును. వృద్ధులైన తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం. వారి ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్చరునికి ఒక పర్యాయం శాంతి జపం జరిపించుకోనుట మంచిది.
రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ న్యాయస్థాన తగాదాలలో విజయం లభింపచేయును. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధా వ్యయం ఎదుర్కొందురు. ఆర్జించిన ధనం చేతిపై నిలువదు. అనుకున్న విధంగా నిలువ ధనం ఏర్పరచుకోలేరు. స్నేహితుల వలన ఆర్ధిక సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో జాగ్రత్తగా ఉండవలెను.
ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. స్వగృహ నిర్మాణం కల నెరవేరుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. ఉద్యోగంలో భాద్యతలు, అధికారం పెరుగుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది.స్వయం కృతాపరాధం వలన కొన్ని బంధాలను నష్ట పోవలసి వస్తుంది. నోటి దురుసు మంచిదికాదని గ్రహించండి. సంవత్సర ద్వితియార్ధం జీవితం మరో కొత్త పంధాలో నడుస్తుంది. మీ పేరు మీద ఉన్న స్తిరస్తులకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగతమైన వాటిపై వాటి విషయంలో జాగ్రత్తలు వసరం అశ్రద్ధ వలన పోగొట్టుకునే అవకాశం ఉంది.
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం