ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి జాతకం

తెలుగువారి యుగాది ఉగాది విశిష్టమైన పర్వదినం. ఉగాది నుంచి శ్రీప్లవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి జాతకం ఎలా ఉందో చూడండి.

ugadi 2021: tula rasi, Scorpio raasi phalalu in Plava Nama year

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృశ్చికరాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 08, వ్యయం - 14, రాజ పూజ్యం - 04, అవమానం - 05

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి సమాజంలో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది. 

వృశ్చికరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.

శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును.  వృశ్చికరాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా తీవ్ర వ్యతిరేక ఫలితాలు కాని, తీవ్ర అనుకూల ఫలితాలు కాని ఏర్పడవు. 

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన చక్కటి ఆర్ధిక లాభములు, వ్యాపార సంబంధ విజయాలు, ఆర్ధిక లావాదేవీలలో కోర్టు కేసులు అనుకూలంగా తీర్పులు లభించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.  

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కష్టములు ఎదురగును. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు, నిత్య తగాదాలు ఎదురగును. అవివాహితుల వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా కష్టం మీద ఫలించును. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృశ్చికరాశి వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది. 

* భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలున్నా ఆర్ధిక పరమైన విషయాలలో ఒకటిగా ఉంటారు. చాలా మదికి మీ సంపాదన మీదతప్ప మీ మీద మమకారం లేదని గ్రహించండి. వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణకు విశేషంగా కృషిచేసి అనుకూల ఫలితాలు పొందుతారు.ఇంటియందు శుభకార్యాలు చేయుట, నూతన గృహారంభాలకు చొరవ చూపిస్తారు. రైతులకు పంటలు లాభాదాయంకంగా పడును. చెడ్డవారితో స్నేహం చేయట తెలియక చేసిన పొరపాటుకు అపనిందలు వస్తాయి. ప్రతి విషయంలో పట్టు విడుపు దొరని ఉండాలి.కొత్త వ్యాపారంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. చెప్పుడుమాటలు విని ఏ నిర్ణయం తీసుకోరాదు. చిన్న చిన్న చిల్లర తగాదాలు ఎక్కువైతాయి జాగ్రత్తలు వహించాలి.

ఈ కింది రాశిఫలాలు కూడా చూడండి...

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో తులారాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కన్యరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో సింహరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios