డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 05, అవమానం - 02.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి చక్కటి విజయాన్ని సూచించుచున్నది.

కన్యారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 01 ఏప్రిల్ 2022 వరకు గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. తరచుగా గురు గ్రహం  అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు ఏర్పరచును. వారసత్వ సంబంధ స్థిరాస్తులు నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన కన్యారాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్త వహించాలి.

శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి సుందరమైన పుత్రికా సంతానం లభించును. పుత్ర సంతానమునకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. లోహ సంబంధ వ్యాపారాలు చేసే వారు విశేషమైన లాభములు పొందుతారు. 

రాహువు- కేతువు ఇరువురూ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. భూ సంబంధ వ్యాపారాలు చేయు వారికి విశేష ధనార్జన కలుగ చేయును. అయితే పితృ వర్గం వారికి సంవత్సరం మధ్య మధ్య తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును. 

ఇంటియందు శుభాకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. గృహ యోగం, గృహనిర్మాణం చేసే అవకాశం ఉన్నది.ఉన్నతలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పేరుప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషమైన కృషి చేస్తారు. విదేశాలకు సంబధించిన విషయాలలో అనుకూలంగా ఉంది. వీసా, గ్రీన్ కార్డు మొదలైనవి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగం, సంతానం కోసం ఎదిరి చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది జాగ్రత్తలు వహించండి.

Also Read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో సింహరాశివారి జాతకం
Also Read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం
Also Read: ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం
Also Read: శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం