డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 14, రాజ పూజ్యం - 03, అవమానం - 01

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకరరాశి వారికి ఆరోగ్య చికాకులను, కుటుంబ సమస్యలను సూచించుచున్నది.

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి సంవత్సరం మొత్తం ఏలినాటి శని ప్రభావంతో ఉంటారు.  శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గురువు వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతికూల ఫలితాలు, 20 నవంబర్ 2021 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. ఆశించిన విధంగా ధనం వృద్ది చెందుతుంది. సంతాన ప్రయత్నాలలో కూడా సఫలత లభిస్తుంది. 

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ద్వితీయ పర్యాయం నడుస్తుంది, ఇది 29 మార్చి 2025 వరకు ఉంటుంది. శని తనుస్థానంలో స్వక్షేత్రంలో ఉండుట వలన వ్యక్తిగత జాతకంలో శని దోషం ఉన్న మకరరాశి వారికి ఈ ప్లవ నామ సంవత్సరం అంతా కలసి రాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశాపరచును. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందురు. వృధాగా ధనం వ్యయం అగును. మీ కుటిల స్వభావం వలన మంచి మిత్రులను దూరం చేసుకొనుటకు సూచనలు అధికంగా ఉన్నవి. చర్మ సంబంధ సుఖ వ్యాధులు వలన బాధలు ఎదుర్కొందురు.

రాహు - కేతువులు ఇరువురి వలన వ్యక్తిగతంగా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవు. అయితే జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో బాగా ఎదిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. 

* కొంత కష్టమో, నష్టమో జీవితాశాయాన్ని సాధిస్తారు. కుటుంబ కలహాలు, కొన్ని విషయాలలో జీవితభాగస్వామి అభిప్రాయాలు కల్వకపోవచ్చును. ఇష్టమైన ఉద్యోగం పొందుతారు. రాజకీయ రంగానికి చెందినవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సన్మానాలు, సత్కారాలు కలుగుతాయి. అనుకోని అవకశం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నం చేసుకునేవారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి.  వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. అంతరంగిక రాజకీయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. కుటుంబంలోని పెద్దలు లేదా తలిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం అని గ్రహించిండి. 

ఈ కింద మరికొన్ని రాశుల జాతకాలు చూడవచ్చు.

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో తులారాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కన్యరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో సింహరాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారి జాతకం

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మిథునరాశి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: వృషభ రాశి వారి జాతకం

శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక ఫలితాలు: మేషరాశి వారి జాతకం